News
News
X

Allu Arjun Pushpa Movie: ‘పుష్ప’లో అల్లు అర్జున్ క్యారెక్టర్ చేయాలనుంది - రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘పుష్ప’ మూవీతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆయన నటనకు బాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఆయన లాంటి క్యారెక్టర్ చేయాలని ఉందటున్నాడు ఓ బీటౌన్ హీరో.

FOLLOW US: 
Share:

అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ సినిమాలో నటించి దేశ విదేశాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ‘పుష్ఫ’ సినిమాలో ఆయన నటనకు అభిమానులు మాత్రమే కాదు, పలు సినీ పరిశ్రమల నటులు సైతం అబ్బుర పడుతున్నారు. అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరో ‘పుష్ప’ సినిమాలో బన్నీ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటకు పెట్టాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు  రణబీర్ కపూర్‌.

అల్లు అర్జున్ లాంటి పాత్ర పోషించాలని ఉంది - రణబీర్ కపూర్

రణబీర్ కపూర్ ప్రస్తుతం తన మూవీ ‘తూ ఝూటీ మైన్ మకార్‌’ ప్రమోషన్ లో బిజీ అయ్యాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా మీకు బాగా నచ్చి, నటించాలనుకున్న క్యారెక్టర్ ఏంటని ఎదురైన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్ చేయాలనుందని వెల్లడించారు.  "గత రెండేళ్ళలో నటన పరంగా నన్ను 3 చిత్రాలు ప్రభావితం చేశాయి. అందులో అల్లు అర్జున్ ‘పుష్ప’, ఆలియా భట్  ‘గంగూబాయి’, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ‘RRR’ ఉన్నాయన్నారు. అయితే, తనకు మాత్రం అల్లు అర్జున్ లాంటి పాత్రలో నటించాలనే ఆశ ఉందని చెప్పారు.   

చైల్ట్ ఆర్టిస్ట్ టు స్టైలిష్ స్టార్

అల్లు అర్జున్ 1985లో వచ్చి ‘విజేత’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా చేసి తన కెరీర్‌ని ప్రారంభించాడు. 2001లో ‘డాడీ’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించాడు. 2003లో ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాను ఆయన తండ్రి అల్లు అరవింద్ సి. అశ్విని దత్‌తో కలిసి నిర్మించారు.  కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటనకు గాను, నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) సినీమా అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత ‘ఆర్య’, ‘ఆర్య2’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘S/O సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’, ‘DJ: దువ్వాడ జగన్నాథం’, ‘అలా వైకుంఠపురములో’ తాజాగా ‘పుష్ప’ సినిమాతో ఆకట్టుకున్నాడు.

పుష్ప’తో దేశ వ్యాప్తంగా క్రేజ్  

దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ పాన్ ఇండియన్ సినిమా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అల్లు అర్జున్ ప్రస్తుతం దాని సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!

Published at : 27 Feb 2023 11:15 AM (IST) Tags: Allu Arjun Pushpa Movie Ranbir Kapoor

సంబంధిత కథనాలు

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

Adivi Sesh On Education : అడివి శేష్‌ను భయపెట్టిన సబ్జెక్ట్ ఏదో తెలుసా?

టాప్ స్టోరీస్

Four MLAS : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

Four MLAS :  ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!