Naseeruddin Shah: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!
సౌత్ సినిమా పరిశ్రమపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ సినిమాలతో పోల్చితే సౌత్ సినిమాలు చాలా మెరుగ్గా ఉంటున్నాయని వెల్లడించారు.
ఒకప్పుడు హిందీ సినీ పరిశ్రమ చిన్ని చూపు చూసిన సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతున్నాయి. ‘RRR’, ‘KGF’, ‘పుష్ప’ లాంటి సినిమాలు సౌత్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజికి తీసుకెళ్లాయి. చిన్న సినిమాలుగా విడుదలైన పలు సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. ‘కాంతార’, ‘కార్తికేయ-2’, ‘సీతారామం’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ 2022 ఒకటి రెండు మినహా పెద్దగా హిట్ అయిన సినిమా లేవీ లేవు. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలపై దేశ, విదేశాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సైతం సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలు మెరుగ్గా ఉన్నాయి- షా
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చిన కమర్షియల్ సినిమాలు తిరుగులేని విజయాలను అందుకుంటున్నాయని నసీరుద్దీన్ వెల్లడించారు. ఈ చిత్ర పరిశ్రమలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కణల ప్రదర్శనే లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలు సినిమాలు నిలకడగా విజయాలను సాధిస్తున్నాయన్నారు. సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఊహాజనితమైన సన్నివేశాలలను సైతం అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేయగలుగుతున్నారని షా చెప్పారు. తెరపై అనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చూపించడంలో సక్సెస్ అవుతున్నారని వెల్లడించారు. “తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో చేసిన కమర్షియల్ సినిమాలు ఊహాజనితంగా ఉంటాయి. కానీ, వాటిని తెరకెక్కించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రూపొందిస్తారు. ఈ విషయాన్ని నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. వారి పాటల చిత్రీకరణ కూడా, జితేంద్ర, శ్రీదేవి కాలంలో నుంచి సరికొత్త మార్పులతో వస్తున్నా, ఒకే లైన్ ప్ ను కలిగి ఉన్నాయి. సౌత్ సినిమాలు చాలా హిందీ సినిమాల కంటే మెరుగ్గా ఉన్నాయి” అని తెలిపారు.
ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలేది ఓటీటీలే- 10 ఏళ్లలో సినిమా థియేటర్ అనేదే ఉండదు -షా
ఎవరైనా ఇష్టపడినా, ఇష్టపడకపోయినా రాబోయే కాలంలో ఎంటర్ టైన్మెంట్ రంగాన్ని ఏలేది డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లేనని ఆయన వెల్లడించారు. భవిష్యత్ లో సినిమా హాళ్లు అంతరించే అవకాశం ఉందన్నారు. “ఎంటర్ టైన్మెంట్ రంగం భవిష్యత్ అంతా ఓటీటీల మీదే ఆధారపడబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా హాళ్లు అదృశ్యమవుతాయని నేను కొంతకాలంగా అంచనా వేస్తున్నాను. ఇంకో 10 ఏళ్లలో సినిమా థియేటర్ అనేదే ఉండదని అనుకుంటున్నాను” అని షా వెల్లడించారు. ప్రస్తుతం ZEE5 సిరీస్ ‘తాజ్ - డివైడెడ్ బై బ్లడ్’లో నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్‌గా కనిపించనున్నారు. మార్చి 3న ZEE5లో ప్రసారం అవుతుంది.
View this post on Instagram
Read Also: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్