Shankar Movies Release: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్
సౌత్ టాప్ హీరో శంకర్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్ మూవీ కాగా, మరొకటి రామ్ చరణ్ మూవీ. ఈ రెండు సినిమాలు రెండు పండగలకు రిలీజ్ కాబోతున్నాయి.
![Shankar Movies Release: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్ Director Shankar Movies Indian 2 Ram Charan RC15 will be released on important festivals Diwali Sankranti Shankar Movies Release: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్‌గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/26/b80fe4930ed6c308002b92e20691fc581677390291694544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సౌత్ లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం శంకర్ ఇదే తొలిసారి. అందులో ఒకటి కమల్ హాసన్ మూవీ. గతంలో వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్ గా ప్రస్తుతం ‘ఇండియన్2’ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా మరో సినిమాను రూపొందిస్తున్నారు.
రెండు సినిమాలకు ఓకేసారి పొస్ట్ ప్రొడక్షన్ పనులు
ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. రామ్ చరణ్ మూవీ షూటింగ్ ఏప్రిల్ లేదంటే మేలో కంప్లీట్ అవుతుంది. ముందుగా ఈ సినిమా కంప్లీట్ కాగానే కమల్ హాసన్ ‘ఇండియన్2’పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారు. రెండు సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి నిర్వహించనున్నారు.
దీపావళికి ‘ఇండియన్2’ విడుదల
అయితే, తాజాగా ఈ సినిమాలకు సంబంధించి విడుదలపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రకటన రాకపోయినా రెండు సినిమాలను రెండు పండుగల సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు దీపావళి, సంక్రాంతిని ఫిక్స్ చేశారట. కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్2’ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. నిజానికి కొన్ని సంవత్సరాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో భారీ సినిమాలను దీపావళి సెలవుల సందర్భంగా విడుదల చేయడం మానేశారు. ‘ఇండియన్2’తో మళ్లీ దీపావళికి భారీ బడ్జెట్ సినిమాల విడుదలకు జీవం పోయనున్నారు. 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా ‘ఇండియన్’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో ‘భారతీయుడు’గా ఈ సినిమా విడుదల అయ్యింది. వసూళ్ల పరంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. తమిళంతో పాటు తెలుగులోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
View this post on Instagram
సంక్రాంతి బరిలో చెర్రీ మూవీ
ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘RC15’ సినిమా వచ్చే ఏడాది అంటే, 2024 సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. అయితే, కియారా పెళ్లి కారణంగా ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే రెండు సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
View this post on Instagram
Read Also: ‘పాన్ ఇండియా’ మూవీస్ కంటే ముందే దేశంలో క్రేజ్ సంపాదించిన దక్షిణాది హీరోలు వీరే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)