‘పాన్ ఇండియా’ మూవీస్ కంటే ముందే దేశంలో క్రేజ్ సంపాదించిన దక్షిణాది హీరోలు వీరే!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. కానీ, కొందరు హీరోలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటించకుండా ఆ రేంజి పాపులారిటి సంపాదించారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు అందరూ పాన్-ఇండియా రిలీజ్ లు అంటూ హడావిడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లు అందుకుంటున్నారు. కానీ, కొంత మంది హీరోలు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా సినిమాలు రిలీజ్ చేస్తూ అన్ని భాషల్లో మంచి విజయాలను అందుకుంటున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ లేదు. పెద్ద హైప్ లేదు. కేవలం మంచి కథలతో చిన్ని సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. రు. ఇంతకీ ఎలాంటి హైప్ లేకుండా పాన్ ఇండియన్ రేంజి పాపులారిటీ పొందిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. దుల్కర్ సల్మాన్
‘సీతారామం’ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. OTT లో రిలీజ్ అయ్యాక తమిళ్, హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు పడిపోయారు. రీసెంట్ గా ‘CHUP’ అనే హిందీ సినిమా తో బాలీవుడ్ లో డీసెంట్ హిట్ కొట్టాడు. పాన్-ఇండియా లాంటి హైప్ లేకుండా ప్రశాంతంగా సినిమాలు తీస్తూ అన్నీ భాషా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు దుల్కర్.
2. ఫహాద్ ఫాసిల్
‘పుష్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు, ‘విక్రమ్’తో తమిళ ప్రేక్షకులకు ఫహద్ బాగా దగ్గరయ్యారు. ‘పుష్ప2’తో దేశ వ్యాప్తంగా ట్రెండ్ కానున్నారు. తొలి భాగంలో కేవలం పరిచయం అయిన ఫహాద్ రెండో పార్ట్ లో నటనతో విజృంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫహాద్ సైతం పాన్ ఇండియన్ సినిమాలో నటించక ముందే ఇతర భాషల్లో బాగా పాపులర్ అయ్యారు.
3. విజయ్ సేతుపతి
ఈయన కూడా ఎలాంటి హడావిడి లేకుండా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతారు. హీరో పాత్రలు చేయకపోయినా, హీరో పాత్రలను డామినేట్ చేసేలా నటించి ఆకట్టుకుంటారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన నటించి ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో పోలీసు అధికారి పాత్రలో అదిరిపోయే నటన కనబర్చారు.
4. నిఖిల్ సిద్ధార్థ
నిఖిల్ తాజా మూవీ ‘కార్తికేయ-2’ ఎలాంటి హైప్ లేకుండా విడుదలై, దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
5. రక్షిత్ శెట్టి
‘చార్లీ’తో అందరికి దగ్గరైపోయారు రక్షిత్ శెట్టి. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా, అదిరిపోయే కథకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. పలు భాషల్లోని ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయ్యారు.
6. కార్తీ
కార్తీ నటించిన తాజా పాన్ ఇండియన్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ సినిమా విడుదలకు ముందే కార్తి దేశ వ్యాప్తంగా పలు సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించారు.
7. ధనుష్
ధనుష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్ కూడా చేసుకోరు. కానీ, ఆయన నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాయి. ఆయన నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ పెద్ద పాన్ ఇండియన్ రిలీజ్ లేదు. కానీ, ధనుష్ తెలుగుతో పాటు హిందీలోనూ బాగా పాపులర్ అయ్యారు.
Read Also: ఓటీటీలో దుమ్మురేపుతున్న’వీరసింహారెడ్డి’, డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డ్!