అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata Leaks : ప్రొడక్షన్ టీమ్ పై మహేష్ ఫైర్!
మహేష్ చెప్పే డైలాగ్ సినిమాలో ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కు క్లాస్ తీసుకునే సన్నివేశంలా అనిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైంది. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. దీంతో ఏదో విధంగా సెట్స్ పై ఉన్న సినిమాల స్టిల్స్, వీడియోలు బయకొస్తున్నాయి. 'సర్కారు వారి పాట' సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది.
దర్శకనిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నా.. లీకులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ చెప్పే డైలాగ్ సినిమాలో ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కు క్లాస్ తీసుకునే సన్నివేశంలా అనిపిస్తోంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ''పొద్దున్నే లేచి వాకింగ్ చేశామా..? మంచి డైట్ ఫుడ్ తిన్నామా..? మళ్లీ సాయంత్రం అయ్యాక మొబైల్ చూశామా..? కొడుకు, మనవడు, మనవరాలితో ఆడుకుని.. మళ్లీ తిని పడుకున్నామా..? లేదా..? ఇదే కదా మనం చేసేది రోజూ..''.
ఈ డైలాగ్ క్లిప్ నెత్తిలో వైరల్ అవుతోంది. దీంతో మహేష్ బాబు అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ దుబాయిలో మొదలైనప్పటి నుండి తాజా షెడ్యూల్ వరకు సెట్ లోని కొన్ని ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వీడియో బయటకొచ్చేసింది. దీంతో మహేష్ ప్రొడక్షన్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చారట. ఇలా అన్నీ లీక్ అవుతూ ఉంటే కథపై ఉన్న ఆసక్తి సన్నగిల్లుతుందని.. ఇకపై ఎలాంటి లీకులు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయమని సూచించారట.
దీంతో అప్రమత్తమైన టీమ్ కొన్ని నిబంధనలు విధించుకున్నట్లు తెలుస్తోంది. సెట్ లోకి ఎవరూ ఫోన్ తీసుకొని రాకూడదని దర్శకుడు పరశురామ్ ఓ రూల్ పాస్ చేశారట. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion