Samantha: సామ్, నయన్‌‌లతో విజయ్ సేతుపతి తిప్పలు, ‘కణ్మణీ రాంబో ఖతీజా’ తమిళ టీజర్ వచ్చేసింది!

సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్న ‘కణ్మణీ రాంబో ఖతీజా’ తమిళ టీజర్ శుక్రవారం విడుదలైంది.

FOLLOW US: 

Kaathu Vaakula Rendu Kaadhal Teaser | సమంత, నయన తార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాతు వాక్కులా రెండు కాదల్’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కణ్మణీ రాంబో ఖతీజా’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ పూర్తికాలేదు. దీంతో చిత్రయూనిట్ ముందుగా తమిళ టీజర్‌ను రిలీజ్ చేసింది. 

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అమాయక ప్రేమికుడిగా నటిస్తున్నాడు. ఒకేసారి సమంత, నయన తారలను ప్రేమిస్తాడు. వారిద్దరూ తన జీవితంలోకి రాగానే ఎన్నో మార్పులు వచ్చాయని, అందుకే ఇద్దరినీ వదల్లేనంటూ వారిని ప్రేమకు ఒప్పిస్తాడు. చివరికి పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి, ఇద్దరి ప్రేమించి ఒకేసారి పెళ్లి చేసుకున్న విజయ్ సంసారం ఎలా సాగుతుంది? ఇద్దరు భార్యలతో అతడికి ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నట్లు ట్రైలర్  చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘టూ టుటు టుటూ..’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. తమిళనాటను ఓ ఊపు ఉపేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

‘‘మీరిద్దరూ ఏ రోజుతే మీ ప్రేమను వ్యక్తం చేశారో.. నా జీవితం అందంగా మారిపోయింది’’ అనే డైలాగుతో టీజర్ మొదలైంది. ‘‘నా జీవితంలో మొదటిసారి మాట్లాడిన అమ్మాయి కూడా నువ్వే.. నువ్వే’’ అంటూ సామ్, నయన్‌లను విజయ్ చూపిస్తాడు. ఇందులో నయన్ తార బెంగాళీ యువతి కణ్మనీ గంగూలీగా కనిపించనుంది. ‘‘ఏదో అతడి శక్తికి కేవలం ఇద్దరిని మాత్రమే ప్రేమించగలుగుతున్నాడు’’ అంటూ ఓ పాత్ర ప్రభూతో చెప్పే డైలాగ్ కూడా బాగుంది. చూస్తుంటే.. ఈ ముగ్గురు కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రస్తుతానికి.. ‘కణ్మణీ రాంబో ఖతీజా’ టీజర్‌ను తమిళంలో చూసేయండి మరి. 

Kaathu Vaakula Rendu Kaadhal Teaser:

Published at : 11 Feb 2022 07:51 PM (IST) Tags: nayanthara samantha Vijay Sethupathi Vignesh Shivan Kaathu Vaakula Rendu Kaadhal Teaser Kanmani Rambo Khatija

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

Buggana On Jagan London Tour :  జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !