Shaakuntalam: బడ్జెట్ దాటేసిన 'శాకుంతలం' - గుణశేఖర్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్!
'శాకుంతలం' ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. దాంతో.. ఈ సినిమాపై వడ్డీల భారం పడబోతోంది.
'రుద్రమదేవి' తరువాత దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న మరో పీరియాడికల్ సినిమా 'శాకుంతలం'. ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. నిజానికి నవంబర్ 4న సినిమా రానుందని చెప్పారు. ఆ తరువాత సినిమాను వాయిదా వేసినట్లు ప్రకటించారు. దానికి కారణం.. ఈ సినిమాను త్రీడీ టెక్నాలజీలోకి మార్చడమే.
ఇలాంటి సినిమాను త్రీడీలో చూపించడం కరెక్ట్ అని భావించిన టీమ్.. దానికోసం వర్క్ చేయడం మొదలుపెట్టారు. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ సినిమాను రూ.50 కోట్లలో పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం బడ్జెట్ రూ.65 కోట్లు దాటేసింది. ఇంకా ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆరోగ్యం బాలేదు. ఆమె కోలుకోవడానికి సమయం పడుతుంది.
'శాకుంతలం' కూడా ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. దాంతో.. ఈ సినిమాపై వడ్డీల భారం పడబోతోంది. అయినప్పటికీ గుణశేఖర్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారట. ఎందుకంటే.. 'శాకుంతలం' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదొక విజువల్ ఫీస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తారనేది గుణశేఖర్ నమ్మకం. త్వరలోనే సమంత నటించిన 'యశోద' రిలీజ్ కానుంది.
ఇది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ సినిమా గనుక హిట్ అయితే.. 'శాకుంతలం'కి అది ప్లస్ అవుతుంది. అందుకే 'యశోద' రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గుంశేఖర్. నవంబర్ 11న 'యశోద' రిలీజ్ కానుంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు.
'యశోద' ప్రీరిలీజ్ బిజినెస్: 'యశోద' సినిమాపై ఏర్పడిన బజ్ కి తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే డీల్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సినిమాస్ సంస్థ, దిల్ రాజు కలిసి రూ.10 కోట్లకు తీసుకున్నారు. కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. 'కార్తికేయ2' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది.
అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి రూ.22 కోట్లకు అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ హక్కులు రెండు కోట్ల మేరకు బేరాలు సాగుతున్నాయి. శాటిలైట్ హక్కుల కోసం కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు నిర్మాత. సినిమా మేకింగ్ అండ్ రెమ్యునరేషన్స్ కలుపుకొని రూ.30 కోట్ల వరకు అయిందట. పబ్లిసిటీ, వడ్డీల కోసం మరో రూ.10 కోట్లు ఖర్చవుతుంది. అంటే మొత్తం రూ.40 కోట్లన్నమాట. దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతోంది.
Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్