అన్వేషించండి

Chiranjeevi's Waltair Veerayya: మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్ 

వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. చిరంజీవి 154 సినిమాకు సంబంధించి శుభాకాంక్షలు చెబుతూ మల్లారెడ్డి కాలేజి స్టూడెంట్స్ మూవీ టీమ్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ను అందించారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి సరైన మాస్ ఎంటర్టైనర్ సినిమా కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు 'వాల్తేరు వీరయ్య' సినిమా టీజర్ మాస్ బిర్యానీలా కనిపించింది. వింటేజ్ చిరంజీవి ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ నుంచి ఇలాంటి మాస్ కట్ ఔట్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలే అయింది. 'వాల్తేరు వీరయ్య' లో చిరంజీవి లుంగీ తో ఉన్న లుక్స్ అదిరిపోవడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సమయంలో మెగాస్టార్ 154 సినిమాకు ఓ కాలేజి స్టూడెంట్స్ వినూత్నంగా  శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఆరు వేలమంది విద్యార్థులతో...
చిరంజీవి 154వ సినిమా సవాల్తేరు వీరయ్య'కు శుభాకాంక్షలు చెబుతూ మూవీ యూనిట్‌కు మల్లారెడ్డి కాలేజి స్టూడెంట్స్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించారు. అది ఏంటంటే... కాలేజి స్టూడెంట్స్ అంతా కలిసి మానవ హారం రూపంలో కూర్చున్నారు. పైనుంచి చూస్తే... వాళ్ళు కూర్చునది 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి లుక్‌లా ఉందన్నమాట. డ్రోన్ సాయంతో ఆ లుక్‌ వీడియో తీసి... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చిరు 'వాల్తేరు వీరయ్య' లుక్‌ రీక్రియేట్‌ చేయడానికి 6 వేల మంది విద్యార్థులు ఆ మానవ హారంలో పాల్గొన్నారట. ఆ వీడియో ను డైరెక్టర్ బాబీ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రాజకీయాల నుంచి విరామం తీసుకున్న తర్వాత చిరంజీవి నిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. 'ఖైదీ నంబర్‌ 150'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాని తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదల చేశారు. అది మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. 

Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...

ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి, రవితేజ మీద సాంగ్‌ షూటింగ్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్‌, దేవి శ్రీ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. అలాగే, రవితేజ - దేవి శ్రీది కూడా! చిరు, రవితేజకు దేవి శ్రీ ఎలాంటి సాంగ్స్‌ అందిస్తున్నారో మరి! సినిమాలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించనున్నారట. వారిద్దరి మధ్య గొడవల నేపథ్యంలో సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో టాక్. 

'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి డబుల్ రోల్‌లో కనిపించనున్నారట. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో చిరు జోడీగా సుమలత కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు కనిపించనున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget