Varalaxmi Sarathkumar : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...
Varalaxmi Sarathkumar on her weight loss : నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. సినిమాలో తన క్యారెక్టర్... వెయిట్ లాస్ గురించి... ఆవిడ ఏం చెప్పారంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie). 'క్రాక్' విజయం తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రమిది. జయమ్మగా 'క్రాక్' సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), ఇప్పుడీ 'వీర సింహా రెడ్డి'లో కూడా కీలక పాత్ర చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో తన క్యారెక్టర్ క్రేజీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
రెండు లుక్స్‌లో కనిపిస్తా! - వరలక్ష్మి
'వీర సింహా రెడ్డి'లో తనది చాలా పెద్ద క్యారెక్టర్ అని, మొత్తం సినిమా అంతా ఉంటుందని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. తాను వెయిట్ లాస్ అవ్వడానికి ఆ సినిమా కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. ఇంకా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ''బాలయ్య గారి సినిమాలో క్యారెక్టర్ నటిగా నాకు సవాల్ విసిరిన వాటిలో ఒకటి అని చెప్పవచ్చు. చాలా మంది 'మీరు ఎందుకు వెయిట్ లాస్ అయ్యారు?' అని అడుగుతున్నారు. 'వీర సింహా రెడ్డి'లో ప్రజెంట్, ఫ్లాష్ బ్యాక్... రెండు పోర్షన్లు ఉన్నాయి. రెండు లుక్స్‌లో కనిపిస్తా. 'యశోద'లో కూడా అంతే! రెండు లుక్స్ ఉంటాయి. రెండిటి మధ్య డిఫరెన్స్ చూపించడం కోసం నేను కావాలని వెయిట్ లాస్ అయ్యాను'' అని చెప్పారు.
బరువు తగ్గమని ఎవరూ అడగలేదు!
తనను బరువు తగ్గమని ఎవరూ చెప్పలేదని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. ''ఆ క్యారెక్టర్స్ ప్రకారం రెండు లుక్స్‌లో డిఫరెన్స్ చూపించడం కోసం బరువు తగ్గితే బావుంటుందని నాకు అనిపించింది. వెయిట్ లాస్ అయితే క్యారెక్టర్ డెప్త్ తెలుస్తుందని ఫీలయ్యాను. 'వీర సింహా రెడ్డి', 'యశోద'... రెండు సినిమాల కోసం బరువు తగ్గాను. రెండు సినిమాల్లోనూ ముందు ప్రజెంట్ సీన్స్ తీసి, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీయడం వల్ల... నాకు హెల్ప్ అయ్యింది'' అని వరలక్ష్మి వివరించారు.
'వీర సింహా రెడ్డి' చూడండి...
క్యారెక్టర్ గురించి తెలుస్తుంది!
'వీర సింహా రెడ్డి'లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అడిగితే సినిమా చూడమని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు. అయితే... తనది క్రేజీ క్యారెక్టర్ అని తెలిపారు. ''వీర సింహా రెడ్డి' కథ విన్న వెంటనే సినిమా చేస్తానని ఒప్పుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది. అంత మంచి క్యారెక్టర్ చేశా. దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి నేను ఇన్ హౌస్ యాక్టర్‌లా అయిపోయా. 'నువ్వు లేకుండా నేను సినిమా చేయను' అని ఆయన అంటున్నారు. నిజం చెప్పాలంటే... నేను గోపీచంద్ మలినేని గారికి థాంక్స్ చెప్పాలి. 'క్రాక్'లో జయమ్మ లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి వచ్చిన పేరు వల్ల, గోపీచంద్ మలినేని గారి వల్లే నేను ఇన్ని తెలుగు సినిమాలు చేస్తున్నాను'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.
Also Read : 'యశోద'కు, నయనతార సరోగసీ ఇష్యూకు సంబంధం లేదు
సమంత (Samantha) 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సరోగసీ నేపథ్యంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా (Yashoda Movie) భారీ ఎత్తున విడుదల అవుతోంది.