India vs West Indies Test Match Day 3 | విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం
వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో భారత్ పూర్తిగా ఆధిపత్యాన్ని చూపించింది. మూడో రోజు రెండవ సెషన్‌లోనే విండీస్ అలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది టీమ్ ఇండియా. మ్యాచ్ ప్రారంభమైన రోజు నుంచే టీమ్ ఇండియా వెస్ట్ ఇండీస్ కు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పూర్తిగా డామినెటే చేసింది. ఇక ఇదే మ్యాచ్ లో మనవాళ్లు ముగ్గురు సెంచరీలతో చెలరేగారు. కే ఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీలు చేసారు.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక పేకమేడలా కుప్పకూలిపోయారు. లంచ్ సమయానికి 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే విండీస్ జట్టు కేవలం 146 పరుగుల అల్ అవుట్ అయింది.
మొహమ్మద్ సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలో 7 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో తగెనరైన్ చంద్రపాల్ ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు... కానీ బాల్ బ్యాట్ అంచుకు వెళ్లి గాలిలోకి బౌన్స్ అయింది. తనవైపు రావడంతో నితీష్ రెడ్డి డైవింగ్ క్యాచ్ పట్టాడు.
నితీష్ క్యాచ్ పట్టగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది.





















