Donald Trump: పంతం నెరవేర్చుకున్న ట్రంప్.. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి- కాల్పుల విరమణకు సై
Israel Agreed To Withdrawal Line Ceasefire | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజా నుంచి బలగాలు ఉపసంహరించుకున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ముగిసిందని కీలక ప్రకటన చేశారు. యుద్ధ విరమణ ప్రతిపాదనను హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయని.. ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. గాజా నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని హమాస్‌కు తెలిపాం. అధికారిక ప్రకటన రాగానే, కాల్పుల విరమణ వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. వినాశనానికి ముగింపు పలికే దిశగా ఒక అడుగు అని అన్నారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ఇలా పేర్కొన్నారు. గాజా నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ ప్రతిపాదనను హమాస్‌కు తెలిపాం. హమాస్ దీన్ని అంగీకరించగానే, కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఇరుపక్షాలు ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే బందీలు, యుద్ధ ఖైదీల పరస్పరం మార్పిడి ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇజ్రాయెల్ తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది. గాజా నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి గొప్ప క్షణం. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని’ ట్రంప్ సూచించారు.
“After negotiations, Israel has agreed to the initial withdrawal line, which we have shown to, and shared with, Hamas. When Hamas confirms, the Ceasefire will be IMMEDIATELY effective, the Hostages and Prisoner Exchange will begin…” - President Donald J. Trump pic.twitter.com/y1fDTuGMmF
— The White House (@WhiteHouse) October 4, 2025
హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
తన ప్రతిపాదనపై ఎలాంటి జాప్యం చేయవద్దని ట్రంప్ హమాస్‌కు హెచ్చరిక జారీ చేశారు. హమాస్ పోరాటం కొనసాగిస్తే, ఆయుధాలను వదలకపోయినా తమ షరతులు రద్దవుతాయని అన్నారు. ఈ ఒప్పందం చాలా సున్నితమైనదని, అయితే ఇజ్రాయెల్, హమాస్ పక్షాలను కలుపుకుని దీనిని విజయవంతం చేస్తామని ట్రంప్ అన్నారు.
హమాస్ సానుకూల స్పందన, బందీల విడుదల
నివేదికల ప్రకారం, ట్రంప్ చేసిన శాంతి ప్రతిపాదనకు హమాస్ సానుకూలంగా స్పందించింది. సంస్థ ప్రతిపాదనలో పేర్కొన్న ప్రధాన అంశాలతో ఏకీభవించింది, ఇందులో బందీల విడుదల, ఖైదీల మార్పిడి, గాజా పరిపాలన అధికారాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించడం ఉన్నాయి. రాబోయే రోజుల్లో అందరు బందీలను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
ఈజిప్టులో పరోక్ష చర్చలకు సన్నాహాలు
మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు సోమవారం (అక్టోబర్ 6, 2025) నుండి ఈజిప్టులో చర్చలు ప్రారంభించనున్నారు. అయితే, కొన్ని అంశాలు ఇంకా స్పష్టంగా లేవు. హమాస్ అన్ని షరతులను పూర్తిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఇజ్రాయెల్ భద్రతాపరమైన ఆందోళనలను ఎలా పరిష్కరిస్తారు. గాజా నుండి ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకోదని, భద్రతా నియంత్రణ కోసం కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకుంటాయని నెతన్యాహు అన్నారు.
ట్రంప్ 20 సూత్రాల గాజా ప్రణాళిక ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20-సూత్రాల గాజా శాంతి పథకంలో తక్షణ కాల్పుల విరమణ, బందీలు, ఖైదీల పూర్తి మార్పిడి, గాజా నుండి దశల వారీగా ఇజ్రాయెల్ ఉపసంహరణ జరుగుతుంది. హమాస్ పూర్తి నిరాయుధీకరణ, అంతర్జాతీయ పర్యవేక్షణలో పరివర్తన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం కింద, అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో పట్టుబడిన బందీలంను, సజీవులుగా ఉన్నవారిని విడుదల చేయాలని భావిస్తున్నారు. హమాస్ ప్రస్తుతం 48 మంది బందీలను కలిగి ఉంది, వీరిలో దాదాపు 20 మంది సజీవంగా ఉన్నారు.
మధ్యప్రాచ్యంలో శాంతికి కొత్త ఆశ!
గాజాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్న హింస, విధ్వంసం మధ్య ఈ ఒప్పందం ఒక పెద్ద రాజకీయ, మానవతాపరమైన మలుపుగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ దేశాలు కాల్పుల విరమణకు ట్రంప్ చొరవను స్వాగతించాయి. ఇది మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి పునాది వేస్తుందని ఆశిస్తున్నాయి. ఈ ప్లాన్ విజయవంతమైతే, గత రెండు దశాబ్దాలలో ఇది అతిపెద్ద మధ్యప్రాచ్య శాంతి చర్య అని విశ్లేషకులు భావిస్తున్నారు.






















