Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ తో ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎలన్ మస్క్ టెస్లా కంపెనీతో మొదలుపెట్టి స్పేస్ ఎక్స్, X, న్యూరాలింక్ మస్క్ లేని ఫీల్డ్ లేదు ఇప్పుడు. వీళ్లందరూ అమెరికా కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. ఇండియా నుంచి సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల లాంటి టెక్ జెయింట్స్ ఉన్నా వాళ్ల కార్పొరేట్ కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు తప్ప సొంతంగా ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించలేదు. కానీ ఆ లోటును పూడ్చేసేలా..మన భారతీయుడు ఒకడు ఆర్టీఫీషియల్ ఇంటిలెజన్స్ జమానా నడుస్తున్న ఈ టైమ్ లో ఓ కొత్త కంపెనీతో వచ్చి రెండేళ్లు కేవలం రెండేళ్లలో గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలకే చెమటలు పట్టిస్తున్నాడు అంటే అస్సలు అతియోశక్తి కాదు. ఎస్ ఆ సంస్థ పర్ ప్లెక్సిటీ అయితే...ఆ కుర్రాడి పేరు అరవింద్ శ్రీనివాస్. మరి ఈ వారం మన టెక్నలాజియా ఎపిసోడ్ అరవింద్ శ్రీనివాస్ స్పెషల్.




















