RTC Charges Hike: ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్, హైదరాబాద్‌లో పెరిగిన సిటీ ఆర్టీసి బస్సు ఛార్జీలు
TGSRTC Hyderabad RTC Fare Hike | హైదరాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది.

Hyderabad RTC Fare Hike | హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ ప్రయాణీకులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) షాకిచ్చింది. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. మొదటి మూడు స్టేజీల వరకు అన్ని రకాల బస్సుల్లోనూ రూ.5 చొప్పున పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అక్టోబర్ 6వ తేదీ (సోమవారం) నుంచి పెంచిన ఛార్జీలు అమల్లో్కి రానున్నాయని సమచారం. వీటితోపాటు మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీకి రూ.5 అదనపు ఛార్జీ కాగా, రెండో స్టేజీ తర్వాత రూ.10 అదనంగా ఛార్జీ చేయనున్నారు.
Shri #YNagireddy garu, VC & MD of TGSRTC, visited Uppal X Roads bus stop today.
— TGSRTC (@TGSRTCHQ) October 4, 2025
He also inspected the Uppal Zonal Workshop and interacted with the staff.#TGSRTC #Telangana #Hyderabad #TakingTelanganaForward pic.twitter.com/sxKv17l1u7






















