అన్వేషించండి

Telangana Local Body Elections: సుప్రీంకోర్టుకు చేరిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల పంచాయతీ, హైకోర్టులోనూ పిటీషన్లు

BC Reservations In Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ఈ 6న విచారణ జరపనున్నారు. హైకోర్టులోనూ దీనిపై పిటిషన్ దాఖలైంది.

Telangana Local Body Elections: హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ నెల 6న (సోమవారం నాడు) ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల పెంపు రిజర్వేషన్ల పరిమితిపై ఏ తీర్పు ఇస్తుందోనని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

బీసీ రిజర్వేషన్లతో లిమిట్ దాటిందని పిటిషన్లు..

మరోవైపు, బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8వ తేదీన తిరిగి విచారణ చేపట్టనుంది. రిజర్వేషన్ల పరిమితి పెంపు, బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుపై తెలంగాణ హైకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తాయన్నది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నామినషన్లకు ముందే ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

5 దశల్లో తెలంగాణలో స్థానిక ఎన్నికలు

తెలంగాణలో మొత్తం ఐదు దశల్లో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అనంతరం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని ఇటీవల ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. కానీ అక్టోబర్ 9న ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఒకవేళ అప్పటివరకూ కోర్టులు ఎటూ తేల్చకపోతే ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడతాయా అనే చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపు..

కాగా, బీసీ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రెండు రోజుల కిందట కీలకంగా సమావేశయ్యారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడంతో రాజ్యాంగ పరంగా, చట్టపరంగా తలెత్తే సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీనియర్ నేత వి. హనుమంతరావు సహా పలువురు బీసీ ప్రముఖులు సమావేశంలో పాల్గొని చర్చించారు. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లడంతో న్యాయపరంగా సవాళ్లను ఎలా ఎదుర్కొవాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు సాధ్యమని చర్చ జరిగింది. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్ల పెంపు అమలు సాధ్యమని కాంగ్రెస్ బీసీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ కు పంపిన బిల్లులు మూడు నెలల్లో ఆమోదం పొందకపోతే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా చేసుకునే వీలును గుర్తు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget