Chaitanya Samantha Maariage Day: చై-సామ్ పెళ్లి రోజు.. మూడేళ్లుగా సమంత పెట్టిన పోస్ట్ లు వైరల్..
ఈరోజు చై-సామ్ ల పెళ్లి రోజు కావడంతో గత మూడేళ్లలో సమంత తన పెళ్లిరోజున భర్త నాగచైతన్యపై కురిపించిన ప్రేమ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సందేశాలను తిరగేస్తూ.. వాటి గురించి చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య-సమంతలకు టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా క్రేజ్ ఉండేది. కపుల్ గోల్స్ సెట్ చేసిన వాళ్లే.. విడిపోతున్నామని అనౌన్స్ చేసి షాకిచ్చారు. చాలా రోజులుగా వీరి విడాకుల విషయంపై వార్తలు వస్తుండగా.. అక్టోబర్ 2న అఫీషియల్ గా ప్రకటించారు. దాదాపు పదేళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. ఆ తరువాత ఒకరినొకరు ఇష్టపడి.. పెద్దలను ఒప్పించి.. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
వీరిద్దరూ కలిసి ఉంటే ఈ రోజున వీరు నాల్గో వివాహా వార్షికోత్సవం జరుపుకునేవారు. కానీ సమంత కావాలనే పెళ్లిరోజుకి ముందుగానే సెపరేషన్ విషయం అనౌన్స్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకే పెళ్లిరోజు కంటే ముందే విడిపోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. ఈరోజు చై-సామ్ ల పెళ్లి రోజు కావడంతో గత మూడేళ్లలో సమంత తన పెళ్లిరోజున భర్త నాగచైతన్యపై కురిపించిన ప్రేమ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సందేశాలను తిరగేస్తూ.. వాటి గురించి చర్చించుకుంటున్నారు.
చై-సామ్ తమ మొదటి పెళ్లిరోజుకి అక్కినేని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. అక్కడ చైతుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నేను రోజూ ఇంటికి వచ్చి నిన్ను చూడడమే నా జీవితంలో సంతోషకరమైన విషయం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram
ఇక రెండో పెళ్లి రోజుని ఇంట్లోనే జరుపుకున్న ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో సమంత.. ''స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్.. పెళ్లై రెండేళ్లు.. పదేళ్ల కథ.. ఇప్పటికీ నీతోనే..'' అంటూ క్యాప్షన్ పెట్టింది.
View this post on Instagram
మూడో పెళ్లి రోజు చైతు కోసం ఓ అందమైన ప్రేమలేఖ రాసింది సమంత. 'చైతన్య నువ్వు నా వాడివి నేను నీదాన్ని.. జీవితంలో ఏ అడ్డు వచ్చినా కలిసి పోరాడదాం' అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.
View this post on Instagram
Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి