Pushpa The Rise: బన్నీ సినిమాపై 'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్..
'అఖండ' సినిమా తరువాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అఖండ' సినిమా.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి బూస్టప్ ఇచ్చింది. థియేటర్లకు జనాలను తీసుకురావడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఓటీటీలో విడుదల కావాలనుకున్న సినిమాలు కూడా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. 'అఖండ' సినిమా తరువాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. అది సినిమాపై అంచనాలను పెంచింది. బన్నీ మేకోవర్, సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కథను వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడో మొదలుపెట్టేశారు. కానీ ఇప్పుడు అనుకున్న రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం 'ఆర్ఆర్ఆర్' సినిమా.
ఎప్పుడైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారో.. అప్పటినుంచి అందరి ఫోకస్ 'ఆర్ఆర్ఆర్'పై పడింది. ట్రైలర్ లాంచ్ రోజు ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. అందులో విజువల్స్, ఇద్దరు స్టార్ హీరోలను చూపించి తీరు, సినిమాలో భారీతనం చూసిన ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. ఈ ట్రైలర్ ప్రమోషన్స్ లో అగ్రెసివ్ గా పాల్గొంటుంది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియాభట్, నిర్మాత దానయ్య ఇలా అందరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.
చెన్నై, ముంబై, బెంగుళూరు లాంటి సిటీల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తే.. దానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇక రెండు రోజుల గ్యాప్ తరువాత ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు మొత్తం కూడా 'ఆర్ఆర్ఆర్' గురించే డిస్కషన్. 'పుష్ప' రిలీజ్ కి మరో ఆరు రోజుల సమయమే ఉంది. ఇలాంటి సమయంలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇలా హడావిడి చేస్తుండడంతో ఆ ఎఫెక్ట్ 'పుష్ప'పై పడుతోంది. కనీసం రేపటినుంచైనా.. జనాలు 'పుష్ప'పై ఫోకస్ పెడతారేమో చూడాలి!
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి