RRR Release Date: మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్‌కు జక్కన్న ఝలక్.. సంక్రాంతి బరిలో ట్రిపుల్ ఆర్
'ఆర్ఆర్ఆర్' సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అనుకుంటున్నట్లుగానే సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న నూతన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ క్రమంలో 'దోస్తీ' అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఆ తరువాత ఉక్రెయిన్ లో సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలో సెట్స్ నుంచి పలు వీడియోలను రిలీజ్ చేసి హడావిడి చేశారు. దీంతో సినిమా దసరాకి రావడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణంగా వలన సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.
Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !
దీంతో సినిమా సంక్రాంతికి లేదా ఉగాదికి వస్తుందని అనుకున్నారు. కొన్నిరోజులుగా సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్' దిగబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. దానికి తగ్గట్లే తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
నిజానికి సంక్రాంతి బరిలోకి దిగడానికి చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు 'సర్కారు వారి పాట', పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్', ప్రభాస్ 'రాధేశ్యామ్' ఇలా అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి. ఇప్పుడు ఊహించని విధంగా 'ఆర్ఆర్ఆర్' కూడా జనవరిలోనే వస్తుంది. కానీ 'ఆర్ఆర్ఆర్'కి మిగిలిన సినిమాలకు మధ్య గ్యాప్ వారం రోజులు మాత్రమే ఉంది. కాబట్టి హీరోలు రిస్క్ చేసే ఛాన్స్ లేదు. మరి ఈ విషయంలో ఏ సినిమాలు వెనక్కి తగ్గుతాయో చూడాలి!
Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥
— RRR Movie (@RRRMovie) October 2, 2021
An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7
Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు
Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు
Also Read:ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి.. మా అధ్యక్ష అభ్యర్థి పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్న నటుడు
Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..