Allu Arjun: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు
మెగాస్టార్ చిరంజీవికి అల్లు కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాడు అల్లు అర్జున్. ఇప్పుడీ ట్వీట్ పై నెటిజన్లు బన్నీని ఏకిపారేస్తున్నారు.
హాస్య నట దిగ్గజం అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు దీనిపై స్పందించిన అల్లు అర్జున్ రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి గారు ఆవిష్కరించడం సంతోషమని ట్వీట్ చేశాడు. తన తాతగారి గురించి చిరంజీవి గారు మాట్లాడిన మాటలు హృదయానికి హత్తుకున్నాయన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు నేను, మా అల్లు కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Its our pleasure to have Chiranjeevi garu unveil the statue of #AlluRamalingaiah garu in Rajahmundry. It was heart touching to hear the fond words he shared about my late grandfather. Me and the allu family whole heartedly thank him for this wonderful gesture. @KChiruTweets pic.twitter.com/9IWU0ajiwc
— Allu Arjun (@alluarjun) October 1, 2021
అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫైరవుతున్నారు. చిరంజీవిని పరాయివాడిలా భావించినట్టు ఆ ట్వీట్ అనిపిస్తోందని కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే మూడు ట్వీట్లు వేశావ్.. వెళ్లి రెస్ట్ తీసుకో.. పడుకో అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
తన మామగారి జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టం అన్నారు చిరంజీవి. అల్లు రామలింగయ్యతో తనకున్నది కేవలం మామా అల్లుళ్ల బంధం మాత్రమే కాదు గురు-శిష్యుల సంబంధం లాంటిదని చెప్పారు. ఈ సందర్భంగా తన మొదటి మూడు సినిమాలు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగాయని గుర్తుచేసుకున్నారు. తాను మొదట అల్లు రామలింగయ్యను కలిసింది ఇక్కడే అన్న చిరంజీవి...అప్పటికీ తాను పెద్ద హీరో కాకపోయినా తనపై నమ్మకంతో కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేసారన్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి, ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి తనతో చర్చించే వారని..నటుడిగా ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో శిక్షణ కూడా తీసుకుని ఆర్‌ఎంపీ పట్టా సంపాదించారని చెప్పారు. ఆయన నటుడే కాదు.. బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు చిరంజీవి.
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు
Also Read: ప్రియాంక విషయంలో నోరు జారిన షణ్ముఖ్.. హామీదను ఎత్తుకొని మరీ శ్రీరామ్ డాన్స్..
Also Read: 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలి.. ఆ విషయాలన్నీ బయటపెడతా.. పూనమ్ వ్యాఖ్యలు