News
News
X

'Aaradugula Bullet' Movie Update: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..

ఈ మధ్యే 'సీటీమార్ ' మూవీతో వచ్చిన గోపీచంద్ వెనువెంటనే 'ఆరడుగల బుల్లెట్' అంటున్నాడు. ఇంత తక్కువ గ్యాప్ లో మరో మూవీ ఎలా సాధ్యం అంటారా…దాని వెనుక పెద్ద కథే ఉంది..

FOLLOW US: 
 
‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆరడుగులు బుల్లెట్’.   2017లో రూపుదిద్దుకున్న ఈ  యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని కారణాల వల్ల  ఆ ఏడాది విడుదలకాలేదు.  ఆ తర్వాత కూడా రిలీజ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కరోనా సమయంలో ఓటీటీ లో  విడుదల చేస్తున్నట్టు వార్తలొచ్చినా అవీ నిజం కాలేదు. ఇప్పటివరకూ ఎన్నో అడ్డంకులు అధిగమించిన ఈ సినిమాను ఎట్టకేలకు అక్టోబర్ 8న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోపీచంద్ ను మాస్ అవతారంలో చూపిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

 గోపీచంద్ - నయనతార జంటగా నటించిన ఈ సినిమాను జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించారు.  సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'సీటీమార్'   ఈ మధ్యే విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో  ఇదే మంచి సమయం అని భావించిన మేకర్స్  'ఆరడుగుల బుల్లెట్' ను వదులుతున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ , కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం , జయ ప్రకాష్ రెడ్డి, చలపతిరావు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.  దర్శకుడు, రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందించారు. అయితే అక్టోబరు 8న మెగా హీరో -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కొండ పొలం' విడుదలవుతోంది. ఉప్పెనతో క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సినిమాకి క్రిష్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి గోపీచంద్, వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో  ఎవరెలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

News Reels

Also Read:ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి.. మా అధ్యక్ష అభ్యర్థి పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్న నటుడు

Also Read: 'పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే'..'వరుడు కావలెను' సినిమా నుంచి మరో పాట

Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 03:02 PM (IST) Tags: gopichand Nayanatara B.Gopal Movie 'Aaradugula Bullet' Release On October 8th

సంబంధిత కథనాలు

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు