Rohit Shetty: హైదరాబాద్‌లో ‘సింగం ఎగైన్’ షూటింగ్ - పతంగులకు బదులు కార్లు ఎగరేస్తున్న దర్శకుడు రోహిత్ శెట్టి
Rohit Shetty: రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సింగం ఎగైన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి యాక్షన్ వీడియోను ఆయన షేర్ చేశారు.
Rohit Shetty Drops BTS From Singham Again Sets: బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి, ఆయన తెరకెక్కించిన పోలీస్ జానర్ చిత్రాలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ‘సింగం’, ‘సింగం 3’, ‘సింబా’, ‘సూర్యవంశ్’ లాంటి కాప్ మూవీస్ అద్భుత విజయాలను అందుకున్నారు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన పోలీస్ డ్రామా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ కానుంది.
‘సింగం ఎగైన్’ షూటింగ్ రోహిత్ శెట్టి బిజీ
ప్రస్తుతం రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. సంక్రాంతి పండగ ఉన్నా, ఆయన షూటింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టోల్ గేట్ నుంచి ఓ కారు దూసుకొచ్చి చిన్న ర్యాంప్ నుంచి దూకి మంటల్లో కాలిపోతున్నట్లు ఈ వీడియోలో చూపించారు. కెమెరాలు అమర్చిన కారును రోహిత్ స్వయంగా నడుపుతూ కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మీరంతా సంక్రాంతికి పతంగులు ఎగురవేస్తుంటే, నేను మాత్రం నా జాబ్‌లో మునిగిపోయాను” అని రాసుకొచ్చారు.
View this post on Instagram
'సింగమ్ ఎగైన్' గురించి..
రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న కాప్ యూనివర్స్ నుంచి 5వ చిత్రంగా ‘సింగం ఎగైన్’ వస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ ఏసీపీ సత్య పాత్రలో కనిపించనున్నారు. సూర్యవంశీగా అక్షయ్ కుమార్, సింబాగా రణవీర్ సింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ విలన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’
సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుంది. జనవరి 5న విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. స్రీమింగ్ కానుంది. ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లతో ట్రైలర్ మొదలవుతుంది. అయితే ఈ పేలుళ్ల వెనక ఉంది ఎవరు అని తెలుసుకోవడానికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ముగ్గురు పవర్ ఫుల్ ఆఫీసర్స్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ని నియమిస్తుంది. ఈ బాంబ్ బ్లాస్ట్‌లు చేసింది ఎవరనేది తెలుసుకునే క్రమంలో వీళ్లు చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్ కలిసి తెరకెక్కించిన ఈ సిరీస్ ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ - ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చంటే?