News
News
X

Mister Mummy Trailer: 'మిస్టర్ మమ్మీ' ట్రైలర్ - రితేష్ దేశ్‌ముఖ్ ప్రెగ్నన్సీ కష్టాలు!

రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటగా నటించిన 'మిస్టర్ మమ్మీ' ట్రైలర్ ను విడుదల చేశారు.

FOLLOW US: 

రితేష్ దేశ్ ముఖ్ రెండు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు సరైన గుర్తింపు సంపాదించలేకపోయారు. టాప్ హీరో స్థాయికి ఎదగలేకపోయారు. రితేష్ కెరీర్ లో కొన్ని హిట్స్ ఉన్నాయి కానీ అతడికి స్టార్ డంను తీసుకురాలేకపోయాయి. అయినప్పటికీ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన నటించిన 'మిస్టర్ మమ్మీ' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇందులో రితేష్, అతడి భార్య జెనీలియా కలిసి నటించారు. షాద్ అలీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను రూపొందించారు. ఒక కపుల్ మధ్య నడిచే స్టోరీ ఇది. వైఫ్ కి పిల్లలంటే ఇష్టం.. కానీ భర్త మాత్రం పిల్లలు వద్దనుకుంటాడు. అలాంటి వ్యక్తికి ప్రెగ్నన్సీ వస్తుంది. తనకు అసలు ప్రెగ్నన్సీ ఎలా వచ్చిందో అర్ధంకాక నానా ఇబ్బందులు పడుతుంటాడు హీరో. వీటి మధ్య కామెడీ పుట్టించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మహేష్ మంజ్రేకర్ డాక్టర్ గెటప్ లో కనిపించారు. 

ట్రైలర్ అయితే ఏమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కామెడీ సీన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నవంబర్ 11న సినిమా రిలీజ్ కానుంది. టీసిరీస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించారు. 

Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా

News Reels

రితేష్ దర్శకత్వంలో 'వేద్':

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. తన మాతృభాష మరాఠీలో సైతం అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు రితేష్. తాజాగా అతను మరాఠీలో 'వేద్' అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు రితేష్. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మంతో ముడిపడ్డ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. 'వేద్' సినిమాతో రితేష్ కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారట. ఈ సినిమాలో కూడా రితేష్ సరసన జెనీలియా హీరోయిన్ గా కనిపించనుంది. నటుడిగానే కెరీర్ అంతంత మాత్రంగా సాగుతున్న రితేష్ కి దర్శకుడిగా ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 

View this post on Instagram
 
A post shared by Riteish Deshmukh (@riteishd)

Published at : 29 Oct 2022 05:09 PM (IST) Tags: Genelia D'Souza Riteish Deshmukh Mister Mummy Mister Mummy trailer

సంబంధిత కథనాలు

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !