అన్వేషించండి
Advertisement
Ravanasura On Sets: రాత్రిపూట... 'రావణాసుర' పాలన... ఇంకా ఇంకా!
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'రావణాసుర' సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.
మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' (Ravanasura). దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. భోగి రోజున పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ఈ రోజు (మంగళవారం) సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రావణాసుర పాలన ఆరంభం కానుందని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం మీద రాత్రిపూట కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని కూడా 'రావణాసుర' టీమ్ అనౌన్స్ చేశారు రవితేజ. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాలో చూపించబోతోన్నారని టీమ్ అంటోంది. లేటెస్టుగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లను కూడా టీమ్ ప్రకటించింది. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సినిమాకు సంగీతం అందించనున్నారు. రవితేజ 'బెంగాల్ టైగర్'కు భీమ్స్ సంగీతం అందించారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'డబుల్ ధమాకా'కు కూడా ఆయన సంగీత దర్శకుడు.
'రావణాసుర' సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది..
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
Also Read: లిప్ లాక్ బ్యూటీకి అంత రెమ్యునరేషన్ ఇచ్చారా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion