By: ABP Desam | Updated at : 22 Jan 2023 08:55 AM (IST)
రష్మికా మందన్నా (Image courtesy - @Rashmika Mandanna/ Instagram)
పుష్ప... పుష్పరాజ్... భారతీయ ప్రేక్షకులకు నచ్చాడు. ఆ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'పుష్ప'కు సీక్వెల్ (Pushpa 2 Shooting Update) తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ షెడ్యూల్ చేశారు. ఓ ఐదు రోజులు చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం విశాఖలో అల్లు అర్జున్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరి, హీరోయిన్ ఎప్పుడు షూటింగులో జాయిన్ అవుతారు? అంటే...
ప్రేక్షకులకు 'పుష్ప' నచ్చితే... పుష్పకు శ్రీవల్లి నచ్చింది. 'చూపే బంగారమాయనే..' అంటూ ఆమె కోసం పాట కూడా పాడాడు. 'పుష్ప 2'లోనూ శ్రీవల్లి ఉంటుంది. ఈసారి పుష్పరాజ్ భార్యగా కనిపించనుంది. ఆ పాత్రను రష్మికా మందన్నా (Rashmika Mandanna) చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో 'పుష్ప 2' గురించి ఆమె క్రేజీ న్యూస్ చెప్పారు.
ఫిబ్రవరిలో 'పుష్ప 2' సెట్స్‌లో...
'పుష్ప 2' గురించి రష్మికను ప్రశ్నించగా... ''ఆల్రెడీ బాయ్స్ (అల్లు అర్జున్ & టీమ్) షూటింగ్ స్టార్ట్ చేశారు. నేను నెక్స్ట్ మంత్ (ఫిబ్రవరిలో) షూటింగులో జాయిన్ అవుతా'' అని సమాధానం ఇచ్చారు. సీక్వెల్ మీద అంచనాలు పెంచేశారు.
'పుష్ప 2'... అంతకు మించి!
'పుష్ప' కంటే 'పుష్ప 2' మరింత బావుంటుందని రష్మిక తెలిపారు. మైండ్ బ్లోయింగ్ అన్నారు. అంతే కాదు... ''ఒకవేళ మీరు సూపర్ స్టార్ అయితే అదే కథ అని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ, సుకుమార్ సార్ రాసిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే అంతకు మించి అనేలా సెకండ్ పార్ట్ ఉంటుంది. దట్స్ సమ్‌థింగ్ ఫ్యాబులస్. వావ్ అనేలా ఉంటుంది. ఆల్రెడీ నటీనటులు అందరూ 'పుష్ప' చేయడం వల్ల... తాము ఎటువంటి ప్రపంచంలో ఉంటున్నామనేది వాళ్ళకు తెలుసు. సో... ఈసారి నటనలో మరింత ఇంటెన్సిటీ ఉంటుంది'' అని రష్మిక చెప్పారు. రష్మిక మాటలతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Also Read : విజయ్ దేవరకొండకు గట్టిగా ఒక్కటి ఇచ్చిన రష్మిక?
విశాఖలో పది రోజులు!
'పుష్ప 2' లేటెస్ట్ షెడ్యూల్ గత శుక్రవారం విశాఖలో మొదలైంది. హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరి విశాఖ చేరుకున్నారు అల్లు అర్జున్. ఎయిర్ పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో బన్నీని చూస్తే... పొడవాటి జుట్టుతో కనిపించారు. సీక్వెల్ కోసం కొత్త స్టైల్ అనుకుంట! కొన్ని రోజులు ఆగితే... ఆ లుక్ బయటకు వస్తుంది.
కథ వినకుండా ఓకే చేసిన బన్నీ!
కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' ఓకే చేశాడని '18 పేజెస్' సినిమా వేడుకలో సుకుమార్ చెప్పారు. అంతే కాదు... ''ఐదు రోజులు 'పుష్ప 2' షూట్ చేశాం. అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటిస్తున్నాడంటే... చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకుని ఒక్కో ఎక్స్‌ప్రెషన్ కోసం అతను ఎంతో కష్టపడుతున్నాడు. నేను ఎప్పుడూ, ఏ సినిమా గురించి చెప్పను గానీ'' అంటూ 'పుష్ప 2'కు ఆకాశమే హద్దు అన్నట్టు పైకి వేలు చూపించారు. 'పుష్ప 2'లో అస్సలు తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పారు.
Also Read : ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను కొంటుందా? - శోభు యార్లగడ్డతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు