అన్వేషించండి

Shobu Yarlagadda: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను కొంటుందా? - శోభు యార్లగడ్డతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!

ఆస్కార్ ప్రమోషన్స్, క్యాంపెయిన్ గురించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడారు.

Shobu Yarlagadda Interview: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో దూసుకుపోతుంది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఇటీవల ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ గురించి డిటైల్డ్‌గా కొన్ని ట్వీట్లు వేశారు. మరి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో ఆయన ప్రమేయం ఎంత? ఫండింగ్ ఆయనే చేశారా? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఏబీపీ దేశం ఆయనతో ఎక్స్‌క్లూజివ్‌గా ముచ్చటించింది. ఆయనేం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న: శోభు.. ఎలా ఉన్నారు?
సమాధానం: బాగున్నాను... అన్నీ బాగా జరుగుతున్నాయి. 2023 బాగా ప్రారంభం అయింది.

ప్రశ్న: దానికి ప్రధాన కారణం RRR కారణం అనుకోవచ్చా?
సమాధానం: కొంచెం అలాంటిదే. ఆర్ఆర్ఆర్‌కు అవార్డ్ సర్కిల్లో మంచి పేరు వినిపిస్తుంది. ఆ సెలబ్రేషన్స్‌లో నేను కూడా ఉన్నాను. కాబట్టి అది కూడా ఒక కారణమే.

ప్రశ్న: ఆస్కార్ క్యాంపెయిన్ గురించి మీకు ఈ మధ్య డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో పెట్టారు. అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
సమాధానం: అంటే దాని గురించి చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. నేను ట్విట్టర్ చూసేటప్పుడు ప్రజల్లో ఆ అంశంపై కొంత కన్ఫ్యూజన్ ఉండటం కూడా చూశాను. దీంతో పాటు చాలా నిర్మాణ సంస్థలు తమ సినిమాలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయని కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. డబ్బులు ఉంటే ఆస్కార్ తెచ్చుకోవచ్చని కూడా కొందరు అంటున్నారు. ఇలాంటి విషయాలు చాలా గమనించాను. దీంతో నాకు తెలిసిన సమాచారం అందించాలి అనుకున్నాను. ఆస్కార్‌కు కానీ, ఇతర అవార్డులకు కానీ ఎలా అప్లై చేయాలి? దాని ప్రొసీజర్ ఏంటి? ఇలా అవసరమైన సమాచారం ఇవ్వాలని ఆ ట్వీట్లు చేశాను.

ఈ గందరగోళం నా మొదటి సినిమా ‘మార్నింగ్ రాగా’ నుంచి ఉంది. ఈ సినిమాను 20 సంవత్సరాల క్రితం నిర్మించాం. అప్పుడు కూడా దానిపై ఇదే కన్ఫ్యూజన్ ఉంది. ‘మార్నింగ్ రాగా’ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయిందని న్యూస్ వచ్చింది. నన్ను టీవీ ఇంటర్వ్యూలు కూడా అడిగాను. కానీ నేను అప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా అదే విషయాలు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నాకు తెలిసింది చెప్పాలి అనిపించింది.

ప్రశ్న: బాహుబలి నిర్మాత ఆర్ఆర్ఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలా మంది అన్నారు. ఆ వ్యాఖ్యలు మీ దాకా వచ్చాయా?
సమాధానం: నేనెందుకు అలా చేస్తున్నానని కొందరు నన్ను అడిగారు. కానీ అది నాకు పూర్తిగా అకడమిక్ అనిపించింది. ఆర్ఆర్ఆర్‌కు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజమౌళి, కార్తికేయ నాకు బాగా క్లోజ్. కానీ నేనెప్పుడూ ఆ క్యాంపెయిన్‌లో పర్సనల్‌గా ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ల క్యాంపెయిన్ వాళ్లు చేసుకుంటున్నారు. నేను కేవలం పక్కన ఉన్నాను అంతే. దాన్ని పూర్తిగా కార్తికేయ, తన టీం చూసుకుంటుంది. దీనికి పూర్తి క్రెడిట్స్ కార్తికేయకే ఇవ్వాలి. అది చాలా పెద్ద టీం. కార్తికేయ, అమెరికాలో ఉండే వేరియన్స్ అనే డిస్ట్రిబ్యూషన్ హౌస్, పొటెన్షియేట్ అనే కంపెనీలు కలిసి ఈ క్యాంపెయిన్ చేస్తున్నాయి. అది చాలా పెద్ద టీం. నేను కేవలం అది గమనిస్తున్నా అంతే. నేను అందులో అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు.

ప్రశ్న: ఆర్ఆర్ఆర్‌కు డబ్బులు పెట్టి అవార్డ్స్ కొంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అసలు అవార్డులకు సెలక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి?
సమాధానం: డబ్బులు పెట్టి అవార్డులు కొన్నారనేది పూర్తిగా తప్పుడు సమాచారం. అలా అయితే ఇప్పటికే మేం (బాహుబలికి) చాలా అవార్డులు కొనేసి ఉంటాం. నాకు తెలిసినంత వరకు అవార్డులను కొనడం అసాధ్యం. కానీ ఏం జరుగుతుందంటే ఆస్కార్ అనేది గ్రాండ్ ఫినాలే లాంటిది. గోల్డెన్ గ్లోబ్స్, బాఫ్టా అవార్డులు మనం వినే ఉన్నాం. వీటితో పాటు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్, నేషనల్ క్రిటిక్స్ అని ఇలా క్రిటిక్ సర్కిల్ అవార్డులు చాలా ఉన్నాయి. ఇలా వందల క్రిటిక్స్ అవార్డులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్నిటికి మాత్రం చాలా మంచి పేరుంది. ప్రజలు వాటిని బాగా సీరియస్‌గా తీసుకుంటారు.

రాజమౌళి ఉత్తమ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్న న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అలాంటిదే. కానీ వీళ్లందరికీ ముందుగా మన సినిమా అనేది ఒకటి ఉందని తెలియాలి. ఉదాహరణకు మనం ఒక సినిమా తీస్తాం. అది ఆడియన్స్‌కు వెళ్లాలంటే ప్రచారం చేయాలి. అంతే కానీ మనం ప్రేక్షకులను కొనట్లేదు కదా. ముందు వాళ్లు సినిమా చూడాలి. ఆ తర్వాత వారికి సినిమా నచ్చాలి. ఆర్ఆర్ఆర్‌కు ముందు నుంచే ఆర్గానిక్ బజ్ ఉంది. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. ప్రజలకు ఆ సినిమా నచ్చడం మొదలైంది. ప్రజలకు ఆ సినిమా నచ్చుతుంది. దాన్ని నువ్వు ఎలా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తావు? దానికి మార్కెటింగ్‌పై ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఆడియన్స్ కోసం వేరియన్స్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ముందుకు వచ్చి ఆ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఆర్ట్ ఫిల్మ్స్, మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కాని వాటి కోసం కొన్ని ప్రత్యేకమైన మల్టీఫ్లెక్స్‌లు ఉంటాయి. అక్కడ ఈ సినిమాను మళ్లీ విడుదల చేశారు. అది సినిమాకు హెల్ప్ అయింది. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో కూడా సినిమా మళ్లీ విడుదల అయింది. అక్కడ కూడా ప్రజలు సినిమాను చూసి ఇష్టపడ్డారు. ఆ తర్వాత క్రిటిక్స్ ఈ సినిమాను చూసి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. పాజిటివ్ రివ్యూలు వచ్చాక ఈ సినిమా క్రిటిక్స్ సర్కిల్‌కు కూడా వెళ్లింది. ఈ రీచ్ మరింత పెరగడానికి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరం. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఓటింగ్ చేసే క్రిటిక్స్‌కు ఈ సినిమా రీచ్ అవ్వాలి. దానికి సంబంధించిన ఫలితాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం. 

దీంతోపాటు డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. అమెరికాకు చెందిన నిర్మాణ సంస్థలు దీనిపై పదుల మిలియన్ డాలర్లను (మనదేశ కరెన్సీలో రూ.వందల కోట్లు) ఖర్చు పెడుతున్నాయి. ఇది వారికి చాలా పెద్ద విషయం. మనం అంత ఖర్చు పెట్టలేం. కానీ బడ్జెట్ మాత్రం ఉండాలి. మళ్లీ ఇది అవార్డును కొనడం కాదు. ఉదాహరణకు తెలుగు సినిమాను తెలుగులో విడుదల చేయాలంటే ఒక బడ్జెట్ కావాలి. హిందీలో విడుదల చేయడానికి ఇంకో బడ్జెట్ కావాలి. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు ఖర్చు పెట్టుకోవాలి. బాహుబలి హిందీలో వర్కవుట్ అవుతుందని అనుకున్నాను. కాబట్టి అక్కడి మార్కెట్ కోసం కొంత ఖర్చు పెట్టాను.

ప్రశ్న: కాంతార, కశ్మీర్ ఫైల్స్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నిజమేనా?
సమాధానం: అది కూడా తప్పుడు సమాచారం. అమెరికాలో ఐదు, ఆరు టెర్రిటరీలు ఉంటాయి. వాటిలో ఒక్క దాంట్లో అయినా సినిమా ఒక్క వారం ఆడితే ఆస్కార్స్‌కు అప్లై చేసుకోవచ్చు. అది మినిమం క్వాలిఫికేషన్. అందులో ఇంకా కొంచెం డిటైలింగ్ ఉంది. కానీ బేసిక్ అయితే వన్ వీక్ ఆడితే చాలు. మీరు దానికి ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ లిస్ట్‌లో వేల సంఖ్యలో సినిమాలు ఉంటాయి. కానీ అందరూ అప్లై చేసుకోరు. అయితే అర్హత ఉండి, అప్లై చేసుకున్న సినిమాల మాస్టర్ లిస్ట్‌ను ఆస్కార్ ప్రకటిస్తుంది.

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డుకు తప్ప మిగతా అవార్డులన్నిటికీ ఈ లిస్ట్‌లో ఉన్న సినిమాలు అర్హత సాధిస్తాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ సినిమా కేటగిరికి మాత్రం ప్రభుత్వం అధికారికంగా పంపించాల్సి ఉంటుంది. మనదేశం నుంచి ఈసారి ‘ఛెల్లో షో’ దీనికి అర్హత సాధించింది. ఈ మాస్టర్ లిస్ట్ అనేది కేవలం రిమైండర్ లిస్ట్ మాత్రమే. వీటిలో ఏ సినిమాకు అయినా ఓట్ వేయచ్చని ఓటర్లకు తెలిపే లిస్ట్ అది. ఓటర్లకు ఈ సినిమా చూపించి, వారి ప్రశంసలు పొంది, ఓట్లు పొందడానికి మార్కెటింగ్ కావాలి. బాహుబలికి మేం అసలు ఆస్కార్స్‌కు అప్లై చేయలేదు.

‘మార్నింగ్ రాగా’కి మా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ అప్లై చేశాడు. అప్పుడు అది రిమైండర్ లిస్ట్‌కు వచ్చింది. అప్పుడు నేను అసలు ఆస్కార్ ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి? అని తెలుసుకున్నాను. లిస్ట్‌లో మన సినిమా ఉన్నంత మాత్రాన అది గొప్ప సినిమా కాదు. ఆస్కార్స్‌కు కేవలం అర్హత మాత్రమే లభిస్తుంది. క్వాలిటీ కూడా అస్సలు విషయం కాదు. వారం ఆడిన సినిమా ఏదైనా ఆస్కార్‌కు ఎలిజిబులే.

ప్రశ్న: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్‌లో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇండియన్ కంటెంట్ మీద ప్రెజర్ ఎలా ఉండబోతుంది?
సమాధానం: 2022లో వచ్చిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉంది. దీంతో ‘ఛెల్లో షో’ కూడా టాప్-10 లిస్ట్‌లోకి వచ్చింది. అది చాలా పెద్ద విషయం. లగాన్ తర్వాత ఈ ఘనత సాధించిన సినిమా ఇదే. నామినేషన్లు త్వరలో రాబోతున్నాయి. అప్పుడు ఏం అవుతుందో చూడాలి? కానీ టాప్-10లోకి రావడమే గొప్ప విషయం. దీంతో పాటు ‘All That Breathes’, ‘The Elephant Whisperers’ అనే డాక్యుమెంటరీ కూడా ఆస్కార్స్ షార్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ఐదు మంచి సినిమాలు హైలెట్ అయ్యాయి. ఇది భారతదేశానికి కూడా మంచిదే. మన కంటెంట్‌కు వెస్టర్న్ ఆడియన్స్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇది కమర్షియల్ సినిమాపై కూడా ఫోకస్‌ను తీసుకొస్తుంది. కాబట్టి వారు మన కంటెంట్‌పై దృష్టి పెడతారు.

ఆర్ఆర్ఆర్ చూసిన వాళ్లు బాహుబలి చూస్తున్నారు, ఈగ చూస్తున్నారు. వీటితో పాటు కాంతార, పుష్ప, కేజీయఫ్ వంటి సినిమాలు కూడా చూస్తున్నారు. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా చూస్తారు. ప్రతి దర్శకుడు, నిర్మాత తమ సినిమాను వీలైనంత ఎక్కువ మంది చూడాలని కోరుకుంటాడు. ఈ అవార్డులు ఆ అవకాశాన్ని ఇస్తున్నాయి.

ప్రశ్న: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన కొత్తలో దీన్ని కొందరు వెస్టర్న్ ఆడియన్స్ గే సినిమా అనుకున్నారు. ఇలాంటివి వాళ్లకు కొత్త కాబట్టి. ఈ కంటెంట్ గ్యాప్ ఎంత వరకు ఉంటుంది?
సమాధానం: ఇంటర్నేషనల్ ఆడియన్స్ దీన్ని గే సినిమాలా చూడలేదు. కానీ ఇది వారికి పూర్తిగా కొత్త. ఇద్దరు మగవారి మధ్య అంత స్నేహం అనేది సాంస్కృతిక పరంగా అక్కడి వారికి పూర్తిగా కొత్త. ఒకరిద్దరు అలా కామెంట్ చేసి ఉండవచ్చు కానీ ఎక్కువ మంది దాన్ని గే సినిమాలా చూడలేదు. రెండు సంస్కృతుల మధ్య సాంస్కృతిక వైరుధ్యం అనేది ఎప్పుడూ ఉంటుంది.

లార్జర్ దేన్ లైఫ్, కమర్షియల్ సినిమా మనం ఎక్కువ చూస్తాం. మన దగ్గర ఆర్ట్ సినిమాలు కూడా తక్కువేమీ లేవు. ఆర్ఆర్ఆర్ యాక్షన్ కారణంగా వెస్టర్న్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఏది అతికించినట్లు ఉండదు. రాజమౌళి ఈ సినిమాలో మంచి స్కిల్ ప్రదర్శించాడు. మనం యాక్షన్, యాక్షన్ అంటున్నాం కానీ దాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదు. దానికి అద్భుతమైన ఇమాజినేషన్, టెక్నికల్ టాలెంట్ ఉండాలి.

ప్రశ్న: ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌కు పెట్టిన ఖర్చు మీరు పెట్టారని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉంది?
సమాధానం: అది అస్సలు నిజం కాదు. రాజమౌళి నాకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. అది తప్ప నాకు ఆర్ఆర్ఆర్‌తో ఎలాంటి సంబంధం లేదు.

ప్రశ్న: రాజమౌళితో మీరు చాలా పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నారని, దాని కోసం ఈ ఫండింగ్ అంతా చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంత?
సమాధానం: ప్రస్తుతానికి రాజమౌళితో ఏదీ ప్లానింగ్‌లో లేదు. ప్రస్తుతం రాజమౌళి, కేఎల్ నారాయణకు ఒక సినిమా చేస్తున్నారు. మా ఇద్దరి కాంబినేషన్ ప్లానింగ్ ఏమీ లేదు. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఆస్కార్ క్యాంపెయిన్ చేస్తున్నారంటే నేర్చుకోవడానికి అది చాలా మంచి అవకాశం. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం, అవన్నీ నేర్చుకోవడం నాకు అకడమిక్ ఇంట్రస్ట్ లాంటిది. అది భవిష్యత్తులో నాకు హెల్ప్ కావచ్చు.

ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్టులు ఏంటి?
సమాధానం: ఇప్పటికి మేం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలతో పని చేస్తున్నాం. వెబ్ సిరీస్, స్ట్రీమింగ్ కంటెంట్ రెడీ చేస్తున్నాం. సినిమాలు ఒక రెండు, మూడు ప్లానింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి మెల్లగా తెలుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget