By: ABP Desam | Updated at : 03 Mar 2023 04:34 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Rashmi Gautam/Instagram
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా సరైన గుర్తింపు రాలేదు. కొన్నేళ్ల తర్వాత ఓ ప్రముఖ టీవీ చానెల్ లో వచ్చిన ‘జబర్దస్త్’ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. దీంతో అప్పటి నుంచి యాంకర్ రష్మీకి ఫాలోయింగ్ పెరిగింది. అటు యాంకర్ గా చేస్తూనే సినిమాల్లోనూ నటించింది. ‘గుంటూరు టాకీస్’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా యాంకర్ రష్మీ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఒక్కోసారి ఆమె మాట్లాడే మాటలు కూడా నెట్టింట చర్చలకు, విమర్శలకు దారితీస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రష్మీ ఏం మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా డైరీ ప్రొడక్ట్స్(పాల ఉత్పత్తులు) పై ఆమె చేసిన ఓ పోస్ట్ మరోసారి ట్రోల్స్‌కు తెరలేపింది.
ఇటీవల రష్మీ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. తాను పాల ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం మానేశానని పేర్కొంది. ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందింస్తూ ఆమె 2019 లో ఓ ఐస్ క్రీమ్ షాప్ ను ఓపెన్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటోను రిప్లై గా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ‘‘ఈ సెలబ్రెటీలు అంతే డబ్బులు కోసం ఏమైనా చేస్తారు మళ్లీ బయటకొచ్చి ఇలా పోస్ట్ లు పెడతారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ నెటిజన్ పోస్ట్ పై రష్మీ స్పందించింది. ‘‘ అవును నేను గతంలో కొన్ని తప్పులు చేశాను, కానీ నేను కొన్నేళ్ల నుంచి పాలను తాగడం మానేశాను. వాటి ఉపయోగం వలన నా స్కిన్ అనారోగ్యానికి గురవడం గమనించాను. అయితే ఇప్పుడు పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలలో వాటి తయారీ విధానం తెలిసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పాల ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం మానేశాను’’ అంటూ బదులిచ్చింది రష్మీ.
ఇక ప్రస్తుతం యాంకర్ రష్మీ ఏం మాట్లాడినా అవి సోషల్ మీడియాలో దుమారం రేపడం పరిపాటిగా మారింది. ఈ పాల ఉత్పత్తుల గురించే కాదు, ఈ మధ్య కాలంలో రష్మీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వీధి కుక్కల దాడి లో ఓ బాలుడి మృతిపై రష్మీ స్పందించిన తీరు నెటిజన్స్ ను మండిపడేలా చేసింది. దీంతో ఆమె ను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలకు దిగారు. అయితే రష్మీ మాత్రం వారికి ఘాటుగా సమాధానం చెబుతూ వస్తోంది. రష్మీ చాలా కాలంగా మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వీగన్ గా మారింది. మాంసం, పాలు, పాల పదార్థాలు ఆమె తినదు. అందుకే పాల ఉత్పత్తులకు కూడా ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేసింది రష్మీ.
And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up
But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2— rashmi gautam (@rashmigautam27) March 2, 2023
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?