By: ABP Desam | Updated at : 10 May 2023 07:14 PM (IST)
తండ్రి రజనీకాంత్‌తో సౌందర్య (ఫైల్ ఫొటో) ( Image Source : Soundarya Rajinikanth Twitter )
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. తన ఎస్‌యూవీ కారు కీ కనిపించడం లేదంటూ సౌందర్య రజనీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు అయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేలోగా తన ఎస్‌యూవీ కారు కీ కనిపించకుండా పోయిందని సౌందర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె తెయనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నివాసంలో ఉంచిన బంగారం, అలాగే ఇతర విలువైన వస్తువులు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో తెలిపింది. అందులో 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు కనిపించడంలేదని వాటి విలువ సుమారు 3.60 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొంది. అయితే వాటి విలువ అంత కంటే ఎక్కువ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఆ ఆభరణాలు ధరించినట్టు పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
అయితే ఐశ్వర్య ప్రస్తుతం ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది. ఈ మూవీ కోసం ఆమె తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో లేకపోవడాన్ని గమనించే ఈ పని చేసుంటారని భావిస్తున్నారు. ఐశ్వర్య తన ఇంటి లాకర్ లో ఆ వస్తువులు ఉంచినట్టు కొంత మంది పని వాళ్లకి తెలుసని ఫిర్యాదు కాపీ బట్టి తెలుస్తోంది. పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఈ పని చేసినట్లుగా ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఆ ఆభరణాలను తాను గతంలో రెండు మూడు చోట్లకు మార్చినట్టు పేర్కొంది ఐశ్వర్య. 2021లో ఆ లాకర్ ను సెయింట్ మేరీస్ లో తన అపార్ట్మెంట్ లో ఉందని, తర్వాత తన మాజీ భర్త ధనుష్ ఇంటికి మార్చానని, తర్వాత 2021 సెప్టెంబర్ లో తిరిగి తన అపార్ట్మెంట్ కు మార్చినట్టు చెప్పింది. 2022 ఏప్రిల్‌లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఐశ్వర్య. అయితే ఆ లాకర్ కీస్ మాత్రం తన అపార్ట్మెంట్ లోనే ఉండేవని ఆ విషయం తన ఇంట్లో పనిచేసే కొంతమందికి తెలుసని చెప్పింది. ఫిబ్రవరి 18న లాకర్ తెరచి చూస్తే తన ఆభరణాల్లో కొన్ని మిస్ అయినట్టు గుర్తించానని తెలిపింది. డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయని పేర్కొంది.
Also Read: విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్ కాపీనా? ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
ఇక ఐశ్వర్య చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకురాలిగా ‘లాల్ సలాం’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందులో రజనీకాంత్ కూడా ఓ గెస్ట్ పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐశ్వర్య మొదటి సారిగా తన తండ్రి రజనీకాంత్ ను డైరెక్ట్ చేయనుంది. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఇందులో రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు.
Also Read: రెండు ఓటీటీల్లో ఆది సాయి కుమార్ 'సనాతన్' - రెస్పాన్స్ ఎలా ఉందంటే?
మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!
Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా
వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు