CSI Sanatan OTT Release : రెండు ఓటీటీల్లో ఆది సాయి కుమార్ 'సనాతన్' - రెస్పాన్స్ ఎలా ఉందంటే?
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'సిఎస్ఐ సనాతన్' మంగళవారం రాత్రి ఓటీటీలో విడుదలైంది. రెండు ఓటీటీ వేదికల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉందంటే?
అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు సైతం థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకు ఓటీటీ వేదికల్లో వస్తున్న రోజులు ఇవి. ఇటువంటి తరుణంలో ప్రామిసింగ్ యంగ్ హీరో నటించిన సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల కావడం, అదీ రెండు ఓటీటీ వేదికల్లో వీక్షకులకు అందుబాటులోకి ఉండటం విశేషమే. అసలు వివరాల్లోకి వెళితే...
ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'సిఎస్ఐ సనాతన్' (CSI Sanatan Movie). మార్చి 10న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా మంగళవారం రాత్రి ఓటీటీలో విడుదలైంది.
అటు అమెజాన్... ఇటు ఆహా!
CSI Sanatan OTT Platform : అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా... రెండు ఓటీటీ వేదికల్లో 'సిఎస్ఐ సనాతన్' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. భవానీ మీడియా సంస్థ ద్వారా రెండు ఓటీటీ వేదికల్లో విడుదలైంది. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ ఫాలో అయ్యే ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ బావుందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ యాక్షన్స్ 'సిఎస్ఐ సనాతన్' సినిమాకు హైలెట్ అని భవాని మీడియా సంస్థ పేర్కొంది. ఏడాదికి మినిమమ్ మూడు నాలుగు సినిమాలు విడుదల చేసే హీరోల్లో ఆది సాయి కుమార్ ఒకరు. ఆయన సినిమాలకు నార్త్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఆది సాయి కుమార్ సినిమాలకు మంచి అమౌంట్ వస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఫాలోయింగ్ ఉండటంతో 'సిఎస్ఐ సనాతన్'కు మంచి వ్యూస్ వస్తున్నాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది.
Also Read : ప్రేమలో ప్రభాస్ - అనుష్క తప్ప ఎవరూ సెట్ అవ్వరా? 'ఆదిపురుష్' ట్రైలర్ మీమ్స్ చూశారు?
'సిఎస్ఐ సనాతన్' సినిమాలో ఆది సాయి కుమార్ జోడీగా యంగ్ హీరోయిన్ మిషా నారంగ్ నటించగా... నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్. 'బిగ్ బాస్' వాసంతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్ ఆఫిసర్ పాత్రలో ఆది సాయి కుమార్ కనిపించారు. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. అనీష్ సోలోమన్ సంగీతం, గంగనమోని శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read : బన్నీతో ఫోటో మాత్రమే, 'పుష్ప 2'లో సీరత్ ఐటమ్ లేదు!
'సిఎస్ఐ సనాతన్' కథేంటి?
వడ్డీలేని రుణాలు అంటూ తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి వచ్చిన ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ వీసీ గ్రూప్ సీఈవో విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) హత్యకు గురి అవుతాడు. ఆయన ఆఫీసులోనే జరిగిన పార్టీలో ఎవరో షూట్ చేస్తారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సిఎస్ఐ) అధికారి సనాతన్ (ఆది సాయి కుమార్) ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు? విక్రమ్ చక్రవర్తి వెనుక ఎవరు ఉన్నారు? అతని లవర్ ఎవరు? సనాతన్ ప్రేమించిన అమ్మాయి ఆ ఆఫీసులో ఎందుకు ఉంది? ఆఫీసులో ఎవరెవరి మీద సనాతన్ అనుమానాలు వ్యక్తం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.