అన్వేషించండి
Advertisement
Balakrishna: 'భార్యను ఏమార్చడానికి 30 సూత్రాలు' - బుక్ రాసిన బాలయ్య!
ఇండియన్ ఐడల్ షోకి గెస్ట్ గా వచ్చారు బాలయ్య.
నందమూరి బాలకృష్ణను మరోసారి వీక్షకుల ముందుకు తీసుకువస్తోంది 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్. ఆల్రెడీ ఈ సంస్థ బాలయ్యతో 'అన్ స్టాపబుల్' షో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కార్యక్రమానికి ఆయనను అతిథిగా తీసుకు వచ్చింది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, కథానాయిక నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్'.
'ఆహా' ఓటీటీలో ఈ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. టాప్ 6 కంటెస్టెంట్లతో సెమీ ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఆ సెమీ ఫైనల్ ఎపిసోడ్‌కు బాలకృష్ణ అతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బాలయ్య తన ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.
ముందుగా స్టేజ్ పై 'అఖండ' సాంగ్ పాడిన కంటెస్టెంట్ ని మెచ్చుకుంటూ.. అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకొని 'ఎందుకయ్యా పెళ్లి..?' అని సరదాగా అడిగారు. ఆ తరువాత 'భార్యను ఏమార్చడం ఎలా..? 30 సూత్రాలు బై ఎన్బీకే' అనే కవర్ పేజ్ తో ఉన్న బుక్ను సదరు కంటెస్టెంట్ కి గిఫ్ట్ గా ఇచ్చారు బాలయ్య. దయచేసి ఈ పార్ట్ ను ఎడిటింగ్ లో తీసేయమని.. ఇంట్లో వసుందర(బాలయ్య భార్య) చూస్తే దబిడి దిబిడే అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. ఈ ప్రోమో మొత్తం ఎంతో సరదాగా సాగింది. మూడు నిమిషాల ప్రోమోనే ఇలా ఉంటే పూర్తి ఎపిసోడ్ మరింత ఫన్ గా ఉండబోతున్నమాట. ఆ ఎపిసోడ్ జూన్ 10న టెలికాస్ట్ కానుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion