By: ABP Desam | Updated at : 16 May 2023 12:38 PM (IST)
Photo Credit: Nandini Reddy/Instagram
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 'అన్నీ మంచి శకునములే'. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఈ మూవీలో ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలో తీయడంలో నందినీ రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆమె నుంచి వస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో మంచి ఆసక్తి నెలకొంది.
ఈ నెల 18న 'అన్నీ మంచి శకునములే' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ‘ప్రాజెక్ట్ K’ టీమ్ 'అన్నీ మంచి శకునములే' సినిమా కోసం స్పెషల్ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ 'అన్నీ మంచి శకునములే' అని చెప్తూ ఈ వీడియోను రూపొందించారు.
‘ప్రాజెక్ట్ K’ టీమ్' స్పెషల్ వీడియోలో, తొలుత పెట్రోల్ అయిపోయి బండిని నెట్టుకుంటూ వస్తున్న యువకుడికి పెట్రోల్ ఇవ్వడంతో మొదలవుతుంది. ఆ తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలికి మామిడి పండ్లు అందించి 'అన్నీ మంచి శకునములే' అని చెప్తారు. ఎండలో ఇబ్బంది పడుతున్న సెక్యూరిటీ గార్డుకు, వర్షం పడే సమయంలో రోడ్డు మీద వెళ్తున్న మహిళకు గొడుకును అందజేస్తారు. యువతులకు టీషర్ట్ లు, మహిళలకు చల్లని మజ్జిగ, కూల్ డ్రింక్స్ అందిస్తారు. హెల్మెట్ లేని వాహనదారులకు హెల్మెట్ అందిస్తారు. పండ్లు, కూరగాయల వ్యాపారులకు ప్లాస్టిక్ రహిత సంచులను అందిస్తారు. చిన్నారులకు టోపీలు ఇస్తారు. చివరకు డైరెక్షన్ చేసి కోపంలో ఉన్న నందిని రెడ్డికి మంచి నీళ్లు అందిస్తూ 'అన్నీ మంచి శకునములే' అని చెప్పడంతో వీడియో పూర్తవుతుంది. అందరి చేత ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిస్తారు.
వేసవిలో చల్లని చిరుగాలిలాంటి మూవీ- నందినీ రెడ్డి
ప్రేక్షకుల మదిని దోచుకునేలా 'అన్నీ మంచి శకునములే' సినిమాను రూపొందించామని డైరెక్టర్ నందినీ రెడ్డి ఇప్పటికే తెలిపారు. ఈ సినిమాను ప్రేమ కథా చిత్రంగా, కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రంగా తెరకెక్కించామని, వైరెటీ స్టోరీతో ప్రేక్షకుల మదిని దోచుకునే విధంగా సీన్స్ ను మలిచామని చెప్పారు. దానికి తోడు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు నటించడం మూవీకి మరో ప్లస్ పాయింటన్నారు. ఈ మూవీలో ఆహ్లాదకరమైన సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం వేసవిలో చల్లని చిరుగాలిలా ఉంటుందన్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, రాజేంద్రప్రసాద్, నరేష్, గౌతమి కన్నడ యాక్టర్ అంజు, వాసుకి, రావు రమేష్, వెన్నెలకిషోర్ కీలక పాత్రలు సోషించారు.
Read Also: ‘RRR’ చూసే టైమ్ లేదు, ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !