Anjali: ప్రియదర్శితో అంజలి.. 'పలాస' డైరెక్టర్ కొత్త సినిమా..
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీవాసు, విద్య మాధురి నిర్మాతలుగా కరుణ కుమార్ దర్శకుడిగా నూతన చిత్రం మొదలైంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభమైంది. వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థగా ఇమేజ్ అందుకున్న జీఏ2పిక్చర్స్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 7గా ఈ నూతన చిత్రం రాబోతుంది.
Also Read: అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ.. సరైన సినిమా ఒక్కటీ పడలేదే..
'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలతో ప్రేక్షకాధరణ అందుకున్న దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అంజలి, ప్రముఖ నటలు రావు రమేశ్, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరక్టర్ మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. అయితే తొలిసారి అంజలి, ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటులు కలిసి నటిస్తుండడంతో సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయింది. మరి ఈసారి కరుణ్ కుమార్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి!
Big Day! Big News!
— Priyadarshi (@priyadarshi_i) October 31, 2021
Thank you so much everyone❤️
(Reading these names and pinching myself) https://t.co/TF7knwySGJ
Also Read: 'Heroes Don't Exist'.. మాస్ హీరో కోసం మరో కొత్త కాన్సెప్ట్..
Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ
Also Read: ఏడాదిన్నర ఎదురుచూశా.... పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజమౌళి
Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్కు పండగే!
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్వుడ్కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి