అన్వేషించండి
Advertisement
HBD Naga Chaitanya: 'థాంక్యూ'... రంగుల రాట్నంలో గుర్రం ఎక్కిన నాగచైతన్య!
అక్కినేని నాగచైతన్య హీరోగా 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా 'థాంక్యూ'. ఈ రోజు చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'థాంక్యూ'. 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. నేడు (నవంబర్ 23, మంగళవారం) నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిశితంగా గమనిస్తే... ఆ లుక్‌లో నాగచైతన్య రంగుల రాట్నంలో గుర్రం ఎక్కి ఉన్నారు. లైట్‌గా పెంచిన గడ్డం, కళ్లజోడు, ఇన్ షర్టుతో నాగచైతన్య చాలా స్టయిలిష్‌గా కనిపించారు. అన్నిటి కంటే ముఖ్యంగా ఆయన సంతోషంగా కనిపించారు. ముఖంలో చిరునవ్వు చాలా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
Presenting the first look of #ThankYouMovie!🤩#HBDYuvasamratNagaChaitanya@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/uwIeOxPIG9
— Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021
నాగచైతన్య సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు... రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ నటిస్తున్నారు.తూ సంతోష పడుతున్నాడు. నాగచైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా నిర్మాతలు 'దిల్' రాజు, శిరీష్ మాట్లాడుతూ "ఇప్పటి వరకు నాగచైతన్య చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను 'థాంక్యూ'లో చేస్తున్నారు. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని కచ్చితంగా, నమ్మకంగా చెప్పగలం. బి.వి.ఎస్. రవి అద్భతమైన కథ అందించారు. దాన్ని అంతే అద్భుతంగా, గొప్పగా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించారు. తమన్ సంగీతం, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్... ప్రేక్షకులకు బెస్ట్ సినిమా అందించడానికి బెస్ట్ టీమ్ వర్క్ చేసింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు.
Also Read: సినిమాతో పాటు దర్శకుడి మాటలు వినిపిస్తే? ఇండియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దేవ్ కట్టా 'రిపబ్లిక్'
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion