Radhe Shyam: ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ సీరియస్.. ఆ రోజు నుంచి గ్యాప్ లేకుండా..
జనవరి 7 నుంచి ప్రభాస్ అగ్రెసివ్ గా 'రాధేశ్యామ్'ను ప్రమోట్ చేయబోతున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పాటలకు విడుదల చేశారు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనకబడిందని విమర్శలు వస్తున్నాయి.
దీంతో పాటు విడుదలవుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ముంబై, చెన్నై, హైదరాబాద్ అంటూ గ్యాప్ లేకుండా వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూ ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంటే.. ప్రభాస్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఫ్యాన్స్ కి రుచించడం లేదు. కానీ ప్రభాస్ ప్రమోషన్స్ లైట్ తీసుకోలేదని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 7 నుంచి ప్రభాస్ అగ్రెసివ్ గా 'రాధేశ్యామ్'ను ప్రమోట్ చేయబోతున్నారట.
పాన్ ఇండియా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాలకు తిరిగి తన సినిమాను ప్రమోట్ చేస్తాడట. ప్రమోషన్స్ విషయంలో ఓ ప్లాన్ కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 7న మొదలుపెడితే.. తన సినిమా రిలీజ్ వరకు కంటిన్యూస్ గా సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటాడట. పేరున్న యూట్యూబ్ ఛానెల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కూడా ప్రమోషన్స్ మొదలుపెడితే మరింత హైప్ క్రియేట్ అవుతుంది.
ఇక పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ బీజియం అందించనున్నారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
Complicated but full of sparks - that's Vikramaditya & Prerana's love story! Watch the #RadheShyamTrailer now.https://t.co/eR3dJYB9CW
— Radhe Shyam (@RadheShyamFilm) December 28, 2021
Starring #Prabhas & @hegdepooja@director_radhaa #BhushanKumar @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/IVgyNXWT0m
Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..
Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు
Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..
Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..
Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి