By: ABP Desam | Updated at : 28 Dec 2021 01:22 PM (IST)
తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..
మెగాహీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కేసు సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వెంటనే అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఈ మెగాహీరో.. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరోసారి ఈ యాక్సిడెంట్ కేసు తెరపైకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ పై ఛార్జ్‌షీట్ ఫైల్ చేయబోతున్నట్లు సైబరాబాద్ కమిషనర్ వెల్లడించారు. సోమవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బైక్ యాక్సిడెంట్ విషయమై పలు కీలక విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి సంబంధించి కేసు నమోదు చేశామని చెప్పిన ఆయన.. తేజు కోలుకున్న తరువాత 91 CRPC కింద నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
నోటీసుల్లో భాగంగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ నుంచి ఎలాంటి వివరణ రాలేదని అన్నారు. ఆయన నుంచి స్పందన రాకపోవడంతో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మరి దీనిపై మెగాహీరో ఎలా స్పందిస్తారో చూడాలి!
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సాయి ధరమ్ తేజ్ త్వరలోనే సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.
Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..
Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..
Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? ఇవాల్టి తాజా ధరలు ఇవిగో - నేడు కూడా పెరిగిన ప్లాటినం ధర