Prabhas New Look : డార్లింగ్ ఈజ్ బ్యాక్ - ప్రభాస్ కొత్త లుక్ చూశారా?
ప్రభాస్ కొత్త లుక్ చూశారా? డార్లింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు! అభిమానులకు ఈ లుక్ చాలా సంతోషాన్ని ఇస్తోంది.
ప్రభాస్... ప్రభాస్... ప్రభాస్... ఇప్పుడు ఆయన పేరు మారు మోగుతోంది. అటు సోషల్ మీడియా, ఇటు సమాజంలో... ఎటు చూసినా ఆయన జపమే. దానికి రెండు కారణాలు ఉన్నాయి! ఒకటి... హిందీ హీరోయిన్ కృతి సనన్‌తో నిశ్చితార్ధం చేసుకోవడానికి రెడీ అయ్యారనేది! రెండోది... జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని! ఈ రెండు కారణాలు చేత ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి ఎలా ఉందోనని ఆలోచిస్తున్నారు.
డార్లింగ్ ఈజ్ బ్యాక్!
రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఫీవర్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేటెస్టుగా కొంత మందిని కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ప్రభాస్ ఫుల్ ఛార్మ్, హ్యాండ్సమ్ గా ఉన్నారు. జ్వరం కూడా పెద్దగా లేదని సమాచారం.
జ్వరం కారణంగా ఈ నెలలో జరగాల్సిన మారుతి సినిమా షూటింగును ప్రభాస్ క్యాన్సిల్ చేశారట. ఆ షెడ్యూల్ వాయిదా వేసి... మరోసారి చేద్దామని చెప్పారట. మారుతి సినిమా సంగతి పక్కన పెడితే... ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
జూన్ 16న 'ఆదిపురుష్'
ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. తొలుత గత ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. అయితే, ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, టీజర్ విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ట్రోల్స్ రావడంతో మళ్ళీ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేస్తున్నారు.
Also Read : 'అమిగోస్' రివ్యూ : నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్ రిలీజ్ డేట్ ఏంటంటే... జూన్ 16న! ఆ రోజు 'ఆదిపురుష్'ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. వెనక్కి వెళ్ళేది లేదని కూడా యూనిట్ చెప్పారు. సో... ఈ ఏడాది ఫస్ట్ 'ఆదిపురుష్'తో ప్రభాస్ థియేటర్లలోకి వస్తారు. ఆ తర్వాత 'సలార్' విడుదల కానుంది.
సెప్టెంబర్ 28న 'సలార్'
జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల అవుతుంది కాబట్టి 'సలార్' వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు అనుకున్నారు. అయితే, హోంబలే ఫిలిమ్స్ సంస్థ సెప్టెంబర్ 28న ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో, ఆ సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో ఉత్తరాది ప్రేక్షకులలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకంటూ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన 'స్పిరిట్' చేయనున్నారు. ఆ సినిమాను చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అందులో ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు.
Also Read : 'పాప్ కార్న్' రివ్యూ : ప్రేమ కథకు డైపర్ వేశారుగా - అవికా గోర్ సినిమా ఎలా ఉందంటే?
'స్పిరిట్' సినిమాను టీ సిరీస్ పతాకంపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ''స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకు వచ్చారు. మ్యూజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి చూసి ఉండరు'' అని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. 'స్పిరిట్' కంటే ముందు 'యానిమల్' విడుదల కానుందని కాబట్టి ప్రభాస్ సినిమా గురించి ఎక్కువ చెప్పడం మాట్లాడటం లేదని ఆయన తెలిపారు.
Prabhas Upcoming Movies : 'ఆదిపురుష్', 'సలార్', మారుతి సినిమాలు కాకుండా... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు. పైన చెప్పిన 'స్పిరిట్' ఇంకొకటి.