Pelli Sandadi Title Song: దర్శకేంద్రుడి స్టైల్ లో 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'పెళ్లి సందD' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
![Pelli Sandadi Title Song: దర్శకేంద్రుడి స్టైల్ లో 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్.. Pelli Sandadi Movie title Song Released Pelli Sandadi Title Song: దర్శకేంద్రుడి స్టైల్ లో 'పెళ్లి సందD' టైటిల్ సాంగ్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/12/f0ffa161b673646e1db8be71bd35c228_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'పెళ్లి సందD' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం ఇదే టైటిల్ తో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు కొత్త 'పెళ్లి సందD'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి పాత 'పెళ్లి సందడి' సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మ్యూజిక్ కూడా మెయిన్ రీజన్. కథ, కథనాలను పక్కన పెడితే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. కీరవాణి అంతగా తన మ్యూజిక్ తో మాయ చేశాడు.
ఇప్పుడు ఈ 'పెళ్లి సందD'లో కూడా పాటలు అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈసారి రాఘవేంద్రరావు డైరెక్షన్ బాధ్యతలు పక్కన పెట్టి నటుడిగా ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గౌరీ రోనంకి ఈ సినిమాకి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. 'ప్రేమంటే ఏంటీ', 'బుజ్జులు' అనే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : Vijay Sethupathi: బాలయ్య కోసం సరైన విలన్.. గోపీచంద్ ప్లాన్ మాములుగా లేదు..
తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను ఎంతో కలర్ ఫుల్ గా రాఘవేంద్రరావు స్టయిల్ లో చిత్రీకరించారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్య బెహ్రా ఆలపించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Prakash Raj Surgery : 'ది డెవిల్ ఈజ్ బ్యాక్..' షూటింగ్ కి రెడీ..
Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)