News
News
X

Vijay Sethupathi: బాలయ్య కోసం సరైన విలన్.. గోపీచంద్ ప్లాన్ మాములుగా లేదు.. 

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు.

FOLLOW US: 

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. దాదాపు అరడజను ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరికొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ లు పట్టుకొని బాలయ్య చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమాను పూర్తి చేసిన బాలయ్య తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. 

ఈ సినిమాను నిజజీవిత సంఘటనలతో తెరకెక్కించనున్నారు దర్శకుడు. ఇందులో భాగంగానే మొన్నామధ్య గోపీచంద్ మలినేని ప్రకాశం జిల్లాకు వెళ్లి.. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకి సంబంధించిన వార్తా పత్రికలను తిరగేసి మరీ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. దీనికోసం చాలా మంది తారలను సంప్రదించారు కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. 

Also Read : Prakash Raj Surgery : 'ది డెవిల్ ఈజ్ బ్యాక్..' షూటింగ్ కి రెడీ..

ఇప్పుడు సినిమాలో విలన్ కోసం కోలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. తమిళనాట హీరోగా ఎన్నో సినిమాలు చేసిన విజయ్ సేతుపతి.. పాత్ర నచ్చితే విలన్ గా కూడా నటిస్తుంటారు. ఈ ఏడాది 'ఉప్పెన' సినిమాలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు దీంతో టాలీవుడ్ మేకర్స్ చాలా మంది విజయ్ సేతుపతిని తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్య సినిమాలో విలన్ గా నటించమని విజయ్ సేతుపతిని అడిగారట. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఓ కొలిక్కి వస్తే విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే విజయ్ సేతుపతి కాల్షీట్స్ ఖాళీగా లేవు. మరి బాలయ్య కోసం ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read : Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..

Published at : 12 Aug 2021 11:04 AM (IST) Tags: Balakrishna Vijay Setupathi Gopichand Malineni NBK 107

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!

Sridevi Birth Anniversary: బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రిమేక్స్ ఇవే!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Gruhalakshmi August 13th Update: తులసి వాళ్ళు వెళ్ళే విమానానికి ప్రమాదం - శ్రుతిని ఇంటికి తీసుకొచ్చేయ్యమని ప్రేమ్ కి చెప్పిన అంకిత

Sridevi: శ్రీదేవి పెట్టిన ఆ కండిషన్ వల్లే ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్? ‘బాహుబలి’కి మళ్లీ అదే రిపీట్!

Sridevi: శ్రీదేవి పెట్టిన ఆ కండిషన్ వల్లే ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్? ‘బాహుబలి’కి మళ్లీ అదే రిపీట్!

టాప్ స్టోరీస్

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

MLA Tractor Journey: మొన్న తెప్పపై, నిన్న అడవిలో ట్రాక్టర్‌పై మహిళా ఎమ్మెల్యే - ఎందుకో తెలిస్తే మెచ్చుకుంటారు !

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

పొదుపు సంఘం నుంచి డబ్బులు తీసుకొని భర్త హత్యకు భార్య కుట్ర- నల్లగొండలో దారుణం

పొదుపు సంఘం నుంచి డబ్బులు తీసుకొని భర్త హత్యకు భార్య కుట్ర- నల్లగొండలో దారుణం