అన్వేషించండి

HariHara VeeraMallu: పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్!

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. 

మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు. కనీసం మార్చి 30నైనా సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. 

ఇదొక పీరియాడికల్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది నిర్మాతలు ఆలోచన. ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఆ విధంగా 2022లో రెండు సినిమాలను పూర్తి చేయాలనేది పవన్ ఆలోచన. 2023 మార్చికి 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) సినిమా రిలీజ్ కానుంది. వేసవిలో 'వినోదయ సీతమ్' రిలీజ్ అవుతుంది. వచ్చే ఏడాదిలోనే హరీష్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'(Bhavadeeyudu Bhagat Singh) సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి పవన్ ఈ మూడు సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. 2024 ఎలెక్షన్స్ సమయంలో పవన్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొత్త సినిమాలు కమిట్ అవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట!

ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్

Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget