By: ABP Desam | Updated at : 05 May 2023 02:57 PM (IST)
Edited By: anjibabuchittimalla
‘OG‘ మూవీ షూటింగ్ (Photo Credit: DVV Entertainment/twitter)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్'. ప్రియా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ అయ్యింది.
ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ గురించి చిత్రబృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణెలో మొదలైనట్లు వెల్లడించింది. అందమైన పచ్చని లొకేషన్స్ నడుమ ఈ సినిమా షూటింగ్ కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పుణెలో చిత్రబృందం కొన్ని పాటలను చిత్రీకరిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. మాఫియా డాన్స్ అందరూ ఆయన అంటే భయపడే సన్నివేశాలు ఉన్నాయట. తొలిసారిగా పవర్ స్టార్ తో సుజీత్ తీస్తున్న మూవీ కావడం, ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్న డీవీవీ సంస్థ దీనిని నిర్మించడంతో ‘OG‘పై పవన్ ఫ్యాన్స్ లో సినీ లవర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక పవన్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.
Pune… You have our heart.💚
— DVV Entertainment (@DVVMovies) May 3, 2023
Lush green landscapes…
Beautiful @priyankaamohan…
and the almighty @PAWANKALYAN.
New schedule begins today. #TheyCallHimOG #OG
'ఓజీ' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ షెడ్యూల్ మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ‘OG’ షెడ్యూల్‌ను పొడిగించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో ప్రతిపాదించిన వారం రోజుల షెడ్యూల్ ఇప్పుడు నెలరోజుల షెడ్యూల్‌గా మారింది. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతోంది. శ్రీలీల ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. కేవలం ఎనిమిది రోజులలోనే తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్, శ్రీ లీలతో కూడిన సన్నివేశాలు, పిల్లలతో కామెడీ సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ‘OG’ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ‘OG’ తొలి షెడ్యూల్ అయ్యాక మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నా, ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అయినా, దర్శకుడు హరీష్ శంకర్ సినిమా తరుపరి షెడ్యూల్ లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డీఓపీ బోస్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. గబ్బర్ సింగ్ కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు.
Team #UstaadBhagatSingh is gearing up for the next schedule 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2023
It is going to be an action packed one 🔥🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/WRJSeMEbh1
Read Also: దుమారం రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’, PVR సినిమాస్ లో చిత్ర ప్రదర్శన రద్దు
Ennenno Janmalabandham June 8th: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!