అన్వేషించండి

The Kerala Story Row: దుమారం రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’, PVR సినిమాస్ లో చిత్ర ప్రదర్శన రద్దు

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కేరళలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు PVR సినిమాస్ ప్రకటించింది.

తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే ఇవాళ(మే 5న) విడుదల అయ్యింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్నా, బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కేరళలో పలు సినిమా థియేటర్ల ముందు అధికార, ప్రతిపక్ష నేతలు నిరసనలు చేపట్టారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనలను రద్దు చేసిన PVR సినిమాస్

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై తీవ్ర వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో  PVR సినిమాస్ కీలక నిర్ణయం తీసకుంది. కొచ్చిలోని తమ థియేటర్లలో సినిమా ప్రదర్శనను  నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒబెరాన్ మాల్ తో పాటు, లులూ మాల్‌లలో ప్రదర్శనను ప్లాన్ చేసింది. నిరసనల నేపథ్యంలో రెండు చోట్లా ప్రదర్శన రద్దు చేసింది. BookMyShow ద్వారా ఈ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు షో క్యాన్సిల్ చేస్తున్నట్లు మెసేజ్ లు పంపించారు. PVR నుంచి అధికారికంగా సినిమా ప్రదర్శన రద్దును ధృవీకరించినప్పటికీ, ఎందుకు రద్దు చేస్తున్నారు? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?

‘ది కేరళ స్టోరీ’ సినిమాను డైరెక్టర్ సుదీప్తోసేన్‌ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. తప్పిపోయిన అమ్మాయిలు, మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమాను నిషేధించాలంటున్న అధికార, విపక్షాలు   

‘ది కేరళ స్టోరీ’ సినిమాను రాష్ట్రంలో విడుదల కాకుండా నిషేధించాలని అక్కడి అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమా ట్రైలర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతపరమైన  ద్వేషాన్ని సృష్టించేందుకు ఈ సినిమాను తీసినట్లు అర్థం అవుతుందని ఆరోపించారు . రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాయని,  వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలను  విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.  సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది.  క్రిస్టియన్‌ అసోసియేషన్‌(సీఏఎస్‌ఏ), బీజేపీ లాంటి పార్టీలో ఈ సినిమా విడుదలకు సోప్టు చేస్తున్నాయి. ‘లవ్‌ జిహాద్‌’తో నాశనం అయిన ఎన్నో కేరళ కుటుంబాల కథే ఈ సినిమా అని సీఏఎస్‌ఏ అభిప్రాయపడింది.

ఏడేళ్లు రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశాం- డైరెక్టర్ సుదీప్తో సేన్

ఈ సినిమా తీయడానికి చాలా రీసెర్చ్ చేసినట్లు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెలిపారు. దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డట్టు వివరించారు. “అమ్మాయిల మిస్సింగ్ కథ విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నాను. కానీ, రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. దీని గురించి అంతా తెలుసుకున్నాకే సినిమా తీశాను” అని తెలిపారు.  

Read Also: ఆస్కార్‌తో పాటు 8 అంతర్జాతీయ అవార్డులపై గురి, 'తంగళన్' టీమ్ టార్గెట్ మామూలుగా లేదుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget