Thangalaan Movie: ఆస్కార్‌తో పాటు 8 అంతర్జాతీయ అవార్డులపై గురి, 'తంగళన్' టీమ్ టార్గెట్ మామూలుగా లేదుగా!
విక్రమ్, పా రంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'తంగళన్'. అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ టెక్నికల్ వ్యాల్యూస్ తో మూవీని రూపొందిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా 'తంగళన్'. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి, తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ గతంలో ఏ చిత్రంలోనూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్పెషల్ కంటెంట్ తో ఆకట్టుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ అతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆస్కార్ సహా 8 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'తంగళన్' చిత్రానికి ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే 50% మించిపోయింది. అయినా, ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదు నిర్మాతలు. పూర్తిగా అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందిస్తున్నారు.
నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్న విక్రమ్
'తంగళన్' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా హీరో విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. యాక్షన సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడ్డారు. దీంతో ఆయన పక్కటెముకులు విరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని చిత్రబృందం హాస్పిటల్‌కు తరలించింది. విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు నెల రోజుల పాటు 'తంగళన్' షూటింగ్‌కు విక్రమం దూరంగా ఉండనున్నారు. 'తంగళన్' ప్రస్తుత షెడ్యూల్ చెన్నైలో జరుగుతుండగా, మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు చిత్ర షూటింగ్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు.
‘తంగళన్’ మూవీ కోసం శ్రమిస్తున్నవిక్రమ్
'తంగళన్' మూవీ కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారియారు.ఊరమాస్ గెటప్‌లో డస్టీ లుక్‌లో ఉన్న విక్రమ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 2023 మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘తంగలన్’ క్రేజ్ దక్కించుకుంది. హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పా రంజిత్ వెల్లడించారు. విక్రమ్‌కు ఇది 61వ చిత్రం. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే 'తంగలన్' సినిమాకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ వీడియోలో ప్రధానంగా విక్రమ్ పాత్రను హైలెట్ చేసింది. విక్రమ్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న విజువల్స్ ను అద్భుతంగా చూపించారు. ‘తంగళన్’లోని పాత్రకు తగినట్లుగా విక్రమ్ తన బాడీని మలుచుకున్నారు. భారీగా బరువును తగ్గడంతో పాటు తన మజిల్స్ లో బలాన్ని తగ్గించుకున్నారు.
కేజీఎఫ్ గనుల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘తంగళన్’
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ‘తంగళన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందగా, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగళన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అటు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ విక్రమ్ నటించారు. అదిత కరికాలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
Read Also: అప్పుడు వినేవారు కాదు, ఇప్పుడు వింటున్నారు - సోదరుల విడాకులపై సల్మాన్ ఫన్నీ కామెంట్స్