Year Ender 2025: థియేటర్లలో ఫ్లాప్... ఓటీటీల్లో సూపర్ హిట్... 2025లో ఈ ఏడు సినిమాలకు డిఫరెంట్ రెస్పాన్స్
OTT Hits Of 2025 Theatrical Releases: ఈ ఏడాది (2025) భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయ్యాయి. ఓటీటీల్లోకి వచ్చాక హిట్ అయ్యాయి. అవి ఏమిటో చూడండి.

ఈ సంవత్సరం (2025) చిత్ర పరిశ్రమకు చాలా ప్రత్యేకమైనది. భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయ్యాయి, తక్కువ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి. భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ OTTలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అవి ఏమిటో చూడండి. థియేటర్లలో ఫ్లాప్ అయినా... OTTలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఏమిటంటే?
1. కూలీ
రజనీకాంత్ నటించిన తమిళ ఎంటర్టైనర్ 'కూలీ' ఆగస్టు నెలలో విడుదలైంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలైన తర్వాత దాని వసూళ్లలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, భారతీయ బాక్సాఫీస్‌లో 285.1 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమాకు OTTలో మంచి వ్యూస్ లభించాయి.
2. వార్ 2
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమైన... హృతిక్ రోషన్ హీరోగా నటించిన స్పై యాక్షన్ సినిమా 'వార్ 2'. ఈ సినిమాపై కూడా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. 'కూలీ'తో క్లాష్ అయింది. బాక్సాఫీస్‌లో ఈ సినిమా విఫలమైనప్పటికీ... OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన వ్యూస్ సాధించింది.
3. మాలిక్
రాజ్ కుమార్ రావు నటించిన బాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'మాలిక్'. ఇదీ బాక్సాఫీస్‌లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమా 54 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, బాక్సాఫీస్ వద్ద కేవలం 26.36 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ మంచి వ్యాస్ పొందింది.
4. మా
కాజోల్ నటించిన సూపర్ నేచురల్ సినిమా 'మా'. జూన్ 27న విడుదలైంది. సినిమా వసూళ్ల విషయానికొస్తే, 36.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రేక్షకులు దీనిని ఇష్టపడ్డారు.
Also Read: Year Ender 2025: ఖాన్‌లు, కపూర్‌లు కాదు... బాలీవుడ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన హీరోలు వీళ్ళే 
5. ది బెంగాల్ ఫైల్స్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమా... ఫైల్స్ ట్రయాలజీ సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలైంది. సినిమా కథ నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. విడుదలకి ముందు దీనిపై చాలా వివాదాలు చెలరేగినా... థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. OTT ప్లాట్‌ఫామ్ జీ5లో సినిమా విడుదలైంది. OTTలో దీనికి మంచి ఆదరణ లభించింది. 
6. ఆజాద్
రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ తొలి చిత్రం 'ఆజాద్'. ఈ సినిమాపై కూడా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ దేవగణ్ కూడా సినిమాలో కనిపించారు. జనవరి 17న థియేటర్లలో విడుదలైన తర్వాత మార్చి 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన వ్యూస్ లభించాయి. 
7. ఎమర్జెన్సీ
కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా పరిస్థితి కూడా అంతే. 1975 నాటి అత్యవసర పరిస్థితిపై తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌లో విడుదలైనప్పుడు పెద్దగా స్పందన రాలేదు, కానీ OTTలో మాత్రం అద్భుతంగా ఆడింది.























