అన్వేషించండి

Vidya Vasula Aham: విద్య వాసుల అహం... థియేటర్లలో కాదు, డైరెక్టుగా ఓటీటీలో!

Vidya Vasula Aham OTT Release: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్యా వాసుల అహం' డైరెక్టుగా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఏ ఓటీటీలో ఈ సినిమా రానుంది? ఆ వివరాలు ఏమిటి? అనేది చూడండి.

సోలో బ్రతుకే సో బెటరు అని పాడుకునే యువతీ యువకుల శాతం మన భారతీయ సమాజంలో తక్కువ మంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. నూటికి 99 శాతం మంది జీవితాల్లో పెళ్లి కామన్! అయితే... పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం కామన్ కాదు. అందరి జీవితాలు ఓకే విధంగా ఉంటాయని, ఉన్నాయని చెప్పలేం. అందుకే, పెళ్లి నేపథ్యంలో ఎన్ని కథలు వచ్చినా కొత్తగా ఉంటాయి. పెళ్లి చుట్టూ తిరిగే కథతో తెలుగులో కొత్త సినిమా రాబోతోంది. అదే 'విద్య వాసుల అహం'. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆహా... భార్యాభర్తల మధ్య ఇగో!?
యంగ్ హీరో రాహుల్ విజయ్ (Rahul Vijay), యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని (Shivani Rajasekhar) జంటగా నటించిన సినిమా 'విద్య వాసుల అహం' (Vidya Vasula Aham). ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని తమ ఓటీటీ వేదికలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు 'ఆహా' పేర్కొంది. త్వరలో ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలియజేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. తమ సినిమా ఆహాలో విడుదల కానుండటం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

''ఎవరెస్టు శిఖరంలో సగం... ఈ 'విద్య, వాసుల' అహం! ఆ కహనీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం! త్వరలో 'ఆహా' ఓటీటీలో మాత్రమే 'విద్య వాసుల అహం' రిలీజ్ కానుంది'' అని తెలిపారు.

Also Read: భార్య ఎవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లను చంపేసే భర్త - నిజం తెలిశాక ఆమె ఏం చేస్తుంది?


Vidya Vasula Aham Movie Concept: కొత్తగా పెళ్లైన జంట 'విద్య వాసుల అహం' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆల్రెడీ టీజర్ విడుదల చేశారు. అందులో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ మధ్య షవర్ బాత్, లిప్ కిస్ వంటివి హైలైట్ అయ్యాయి. మరి, సినిమాలో వాళ్లిద్దరి మధ్య ఇగో క్లాష్ ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. అతి త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయలేదు.

Also Read: 3Dలో ‘RRR’ మూవీ - రీరిలీజ్ ఎప్పుడో తెలుసా? టికెట్స్ బుక్ చేసేసుకోండి మరి!


Vidya Vasula Aham Cast And Crew: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, వైవా రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అఖిల్ వల్లూరి, కూర్పు: సత్య గిడుతూరి, సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి - చందన కట్ట, సంగీతం: కల్యాణీ మాలిక్, రచన: వెంకటేష్ రౌతు, కథనం, దర్శకత్వం: మణికాంత్ గెల్లి,నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్, సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్, నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు - లక్ష్మీ నవ్య మక్కపాటి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABPAkshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
Virat Kohli: దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
Nivetha Pethuraj:  కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
Embed widget