అన్వేషించండి

Tiger Nageswara Rao OTT Release : 'టైగర్ నాగేశ్వరరావు' డిజిటల్ స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

Tiger Nageswara Rao OTT Release Date Platform : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.

Tiger Nageswara Rao Movie OTT Platform : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఆంధ్రా రాబిన్ హుడ్ అని పేరు పొందిన స్టూవర్టుపురం నాగేశ్వర రావు (Stuartpuram Nageswara Rao) బయోపిక్ ఇది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు విడుదల చేశారు. ఇది రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పాలి. ఈ సినిమా ప్రచారం కోసం ఆయన ముంబై వెళ్లారు. ఇతర నగరాలకు వెళ్లి ప్రమోట్ చేశారు. 

పాజిటివ్ రివ్యూలతో మొదలైన ప్రీమియర్లు
అమెరికాలో ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. 'టైగర్ నాగేశ్వర రావు' చిత్రానికి యూకే, అమెరికా నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ నటనకు అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రైలు రాబరీ సీన్ (హీరో ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్) హైలైట్ అని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశామని మాస్ మహారాజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెకండ్ హాఫ్ రన్ టైమ్ ఎక్కువ అయ్యిందని, పాటలు బాలేదని కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది.  

ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రైమ్ వీడియో
Tiger Nageswara Rao Digital Streaming Rights : 'టైగర్ నాగేశ్వర రావు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : 'టైగర్ నాగేశ్వరరావు' ఆడియన్స్ రివ్యూ : సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? - సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది?
  
'టైగర్ నాగేశ్వర రావు' సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఎనిమిది వారాల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రైమ్ వీడియోలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Also Read 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?

లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాల తర్వాత వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' నిర్మాత ఆయనే. అంతే కాదు... రవితేజ హిట్ సినిమా 'ధమాకా' నిర్మాణంలో కూడా ఆయన భాగస్వామి. 

'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ ఓ కథానాయికగా నటించారు. గాయత్రి భరద్వాజ్ మరో కథానాయిక. ఇంకా జయవాణి పాత్రలో తమిళ బ్యూటీ అనుకీర్తి వ్యాస్ నటించారు. హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్, 'ఆడుకాలం' నరేన్, ప్రదీప్ రావత్ ఇతర ప్రధాన తారాగణం. 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంచలనం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మది, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Sreemukhi : శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
Embed widget