'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ ఏరియాలో ఎంత జరిగింది? రవితేజ ముందున్న టార్గెట్ ఎంత? వివరాల్లోకి వెళితే.... 'టైగర్ నాగేశ్వరరావు' నైజాం రైట్స్ రూ. 8.60 కోట్లకు ఇచ్చారని తెలిసింది. ఆంధ్రా ఏరియాలో 'టైగర్...' బిజినెస్ బాగా జరిగింది. అక్కడ నుంచి రూ. 17 కోట్లు వచ్చాయి. 'టైగర్...' సీడెడ్ బిజినెస్ కూడా బావుంది. ఆల్మోస్ట్ రూ. 5.50 కోట్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ సినిమా రూ.31.10 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 'టైగర్'ను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 4 కోట్లకు ఇచ్చారట. ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'టైగర్ నాగేశ్వర రావు'కు మూడు కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూ. 37.60 కోట్ల బిజినెస్ చేసింది. థియేట్రికల్ వరకు చూస్తే... రూ. 38.60 కోట్ల కలెక్షన్స్ వస్తే 'టైగర్ నాగేశ్వరరావు' బ్రేక్ ఈవెన్ అయినట్లు!