This Week OTT Movies: ‘టిల్లు స్వ్కేర్’ to ‘ది గోట్ లైఫ్’- ఈవారం థియేటర్లతో పాటు ఓటీటీలో అలరించే సినిమాలివే!
ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
This Week Release Telugu Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి? ఏ వెబ్ సిరీస్ లు ఓటీటీలో అలరించబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
1. టిల్లు స్వ్కేర్- మార్చి 29న విడుదల
‘డీజే టిల్లు’ సినిమాతో ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘టిల్లు స్వ్కేర్’ తో మరోసారి ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తోంది. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది.
2. ది గోట్ లైఫ్(ఆడు జీవితం)- మార్చి 28న విడుదల
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ఈ మూవీ ‘ఆడు జీవితం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందుతోంది. అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1. ప్రేమలు- మార్చి 29న విడుదల
మలయాళంతో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు’. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు వసూళు చేసి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఆ తర్వాత తెలుగులో విడుదలై, ఇక్కడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మార్చి 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.
2. లూటేరే- మార్చి 28న మూడో ఎపిసోడ్ విడుదల
‘లూటేరే’ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి రెండు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మార్చి 28న ఈ సిరీస్ కు సంబంధించి మూడో ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుక రానుంది.
3. ట్రూ లవర్- మార్చి 27న విడుదల
యూత్ ఫుల్ మూవీగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ట్రూ లవర్’. మాస్ మూవీ బ్యానర్ లో దర్శకుడు మారుతి, నిర్మాత SKN కలిసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. మణికందన్, గౌరీ ప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మార్చి 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.
4. పట్నా శుక్లా- మార్చి 29న విడుదల
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పట్నా శుక్లా’. మార్చి 29 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
1. ఇన్‌స్పెక్టర్ రిషి- మార్చి 29న విడుదల
నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. నందిని జె.ఎస్ దర్శకత్వంలో తెరకెక్కింది. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
1. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో- మార్చి 29న విడుదల
బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ తాజాగా షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 29 నుంచి ప్రసారంకానుంది. ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.
2. లాల్ సలామ్- మార్చి 29న విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లాల్ సలామ్’. ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్‌మైషో
1. ది హోల్డోవర్స్- మార్చి 29న విడుదల
పాల్ గియామట్టి, డావిన్ జాయ్ రాండోల్ఫ్, డొమినిక్ సెస్సా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ మూవీ ‘ది హోల్డోవర్స్’. మార్చి 29 నుంచి బుక్ మైషో లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
Read Also: 'రంగస్థలం' కాంబో ఈజ్ బ్యాక్ - ఈసారి పాన్ వరల్డ్ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకునేలా