SS Rajamouli: ఓటీటీకి వచ్చేసిన ఎస్‌ఎస్ రాజమౌళి డాక్యూమెంటరీ - ఇందులో ఏం చూపించారంటే!
Rajamouli Modern Masters: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఎస్‌ఎస్ రాజమౌళిపై డాక్యూమెంటరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి పేరుతో ఈ డాక్యూమెంటరిని తాజాగా రిలీజ్ చేశారు.
Rajamouli Modern Masters Documentary Release: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై(SS Rajamouli) ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) డాక్యూమెంటరి రూపొందించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితం, సినీరంగ ప్రవేశంతో పాటు దర్శకుడిగా ఆయనను ఇన్‌స్పైర్ చేసిన సంఘటనల నేపథ్యంలో ఈ డ్యాక్యమెంటరి సాగనుంది. దీనికి 'మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి' పేరుతో తెరకెక్కించారు. తాజాగా జక్కన్న డాక్యూమెంటరిని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రకటన ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇందుకు సంబంధంచిన ప్రోమో రిలీజ్ చేసింది.
‘మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’ డాక్యుమెంటరీలో (SS Rajamouli Modern Masters Documentary) జక్కన్నతో సన్నిహితంగా ఉండే హీరోలు, స్టార్స్, ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, మేకర్స్‌ని కూడా భాగం చేస్తూ ఈ డాక్యూమెంటరిని రూపొందింది. ఇందులో వారంత రాజమౌళితో ఉన్న అనుభవాలను పంచుకోవడంతో పాటు ఆయన పనితనం, వర్క్ విషయంలో ఆయన చూపించే శ్రద్ధా ఎలా ఉంటుందనేది వివరిస్తుంటారు. అలాగే రాజమౌళిని ఇన్‌స్పైర్ చేసిని తన బ్లాక్‌బస్టర్ సినిమాల తెరకెక్కించే టైంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు వంటివి పంచుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆర్‌ఆర్‌ఆర్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కరణ్ జోహార్, హాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ పలు సందర్భాల్లో రాజమౌళిపై ప్రశంసలు కరిపించిన క్లిప్స్‌ని కూడా ఈ డాక్యూమెంటరిలో యాడ్ చేశారు.
View this post on Instagram
Also Read: ఎన్టీఆర్ - జాన్వీ జంట ముద్దొస్తుంది కదూ... 'దేవర'లో రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
జక్కన్న గురించిన ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్న విశేషాలను కూడా చూపించారు. అలాగే దర్శకుడిగా తన ప్రయాణం ఎలా మొదలైంది.. తన సినిమాలకు ఏ ఫిలిం బై ఎస్ ఎస్ రాజమౌళి అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది వంటి ఆసక్తికర విషయాలను స్వయంగా జక్కన్న పంచుకున్నారు. రాజమౌళి గురించి ఎన్నో విషయాలు అందరికి తెలిసిన.. కొన్ని తెలియని విషయాలను కూడా పంచుకున్నారు. అందులో మగధీర సినిమా గురించి చెప్పిన విశేషాలు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ డాక్యూమెంటరీలో రాజమౌళికి సంబంధించిన రేర్ ఫోటోలు చూపించడంతో ఫ్యాన్స్ అంతా ఎగ్జైట్ అయ్యారు.
A master of his craft, a cinema phenomenon. Watch director S. S. Rajamouli's journey from Student No. 1 to RRR 🎥🎬
— Netflix India (@NetflixIndia) July 22, 2024
Modern Masters: S.S. Rajamouli, coming on 2 August, only on Netflix!#ModernMastersOnNetflix pic.twitter.com/VRmvVJwDiN
Also Read: అరుదైన ఘనత సాధించిన ధనుష్ 'రాయన్' - ఏకంగా ఆస్కార్ లైబ్రరీలో చోటు