అన్వేషించండి

Devara Second Single: ఎన్టీఆర్ - జాన్వీ జంట ముద్దొస్తుంది కదూ... 'దేవర'లో రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?

NTR Janhvi Kapoor Still: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ జంట చూడముచ్చటగా ఉంది కదూ! అన్నట్టు... 'దేవర'లో ఈ జోడీ మీద తీసిన పాటను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా సినిమా 'దేవర' (Devara Part 1). ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కొన్ని రోజుల క్రితం విడుదల కాగా... చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండింగ్ లిస్టులో ఉంది. అందులో ఎన్టీఆర్ ఉగ్ర రూపాన్ని చూపించారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇప్పుడు 'దేవర'లో రొమాంటిక్ యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యారు. సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

ఎన్టీఆర్ - జాన్వీ జంట... చూడముచ్చటగా!
Jr NTR and Janhvi Kapoor lovely still from Devara: 'దేవర'లో ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే... ఇప్పుడు ఎన్టీఆర్ (NTR Look In Devara)తో ఉన్న స్టిల్ విడుదల చేశారు. అందులో ఈ జంట చూడముచ్చటగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ఆగస్టు 5న... అంటే ఈ సోమవారం 'దేవర పార్ట్ 1'లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ విడుదల చేయనున్నట్టు చెప్పారు. అందులోది ఈ స్టిల్. ఆల్రెడీ వైరల్ అవుతోంది.

Also Read: జాన్వీ కపూర్ ఆశలన్నీ ఎన్టీఆర్ 'దేవర' పైనే - లేటెస్టుగా బాలీవుడ్‌లో ఆమెకు మరో డిజాస్టర్?

హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, హీరోయిజం నేపథ్యంలో వచ్చే పాటలకు అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) స్పెషలిస్ట్ అని పేరు ఉంది. 'జైలర్'లో హుకుం సాంగ్ గానీ, 'విక్రమ్'లో 'ఇక మొదలెడదామా' సాంగ్ గానీ, 'దేవర'లో ఫియర్ సాంగ్ గానీ, అంతకు ముందు పలు సినిమాల్లో ఆయన ఇచ్చిన హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే... ఆయన సంగీతంలో చార్ట్ బస్టర్ లవ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దాంతో 'దేవర' సెకండ్ సింగిల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Readబృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?


పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 27వ సినిమా!
Devara Part 1 Release Date: 'దేవర' ఐదు భాషల్లో విడుదల కానుంది. ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్'ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడీ రెండో పాట కూడా ఐదు భాషల్లో రానుంది. సినిమాను సైతం ఈ ఐదు భాషల్లో పాన్ ఇండియా, వరల్డ్ స్థాయిలో సెప్టెంబర్ 27న భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్


'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. మరో విలన్ క్యారెక్టర్ కోసం 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ (Bobby Deol)ను ఎంపిక చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కె హరికృష్ణ, మిక్కిలినేని సుధాక‌ర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget