RRR on OTT: ఓటీటీలో RRR వచ్చేది ఈ తేదీనే, అదనంగా నగదు చెల్లించాలా?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR మూవీ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమమైంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘RRR’ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు కుంభస్థలాన్ని బద్దలకొట్టిన సంగతి తెలిసిందే. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ఆలస్యంగా విడుదలవుతుందని భావించారు. అయితే, మరో వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మే 20వ తేదీన ‘Zee5’ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం చూసేందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలనే వదంతులు షికారు చేస్తున్నాయి. అయితే, దీనిపై ‘Zee5’ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి, మీరు ఆ ఓటీటీకి సబ్‌స్క్రైబర్ అయినట్లయితే ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. అన్ని చిత్రాల్లాగే RRR మూవీని కూడా కస్టమర్లు ఉచితంగా ఆస్వాదించవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని..: మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆ తేదీనే చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే మంచిదనే ఆలోచన RRR టీమ్‌కు వచ్చిందట. పైగా ఆరోజు శుక్రవారం కావడంతో మే 20కే అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను, ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతి లాల్.. సినిమా విడుదలైన మూడు నెలల తరువాతే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని ఇంతకు ముందు చెప్పారు.
అయితే, అప్పటికే సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ‘జీ5’ త్వరగా విడుదల చేసేందుకు ఆయనపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా RRR మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే, RRR తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు మాత్రమే ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలిసింది. హిందీ RRRను ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
#RRR premiering on Zee5, May 20th! pic.twitter.com/sbR25Qtblf
— LetsOTT Global (@LetsOTT) May 12, 2022
View this post on Instagram