Raayan OTT Release Date: రాయన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మారింది - ఈ నెలల్లోనే స్ట్రీమింగ్, ఎందులో అంటే?
Raayan OTT Platform: ధనుష్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాయన్' త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. అయితే, ఓ ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మారింది.
Dhanush Raayan OTT Release Date Announced: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కొత్త సినిమా 'రాయన్'. ఆయన 50వ చిత్రమిది. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే... దర్శకత్వం కూడా ఆయన వహించారు. జూలై 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి, ఓటీటీలో ఎప్పుడు వస్తుందో తెలుసా?
ఆగస్టు 23వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో!
Dhanush's Raayan Movie OTT Platform: పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో 'రాయన్' ఓటీటీ రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
'రాయన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. ఆగస్టు 23... అంటే వచ్చే శుక్రవారం నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు వెల్లడించింది.
Raayan has a PURPOSE to fulfill and JUSTICE to seek ⚖️🔥#RaayanOnPrime, Aug 23@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/1I3mqFw0GR
— prime video IN (@PrimeVideoIN) August 16, 2024
ఓటీటీ వేదిక మారింది... ముందు ప్రైమ్ అనుకోలేదు!
స్టార్ హీరోస్ సినిమాల ఓటీటీ రైట్స్ విడుదలకు ముందు హాట్ కేకులు తరహాలో అమ్ముడు అవుతున్నాయి. అయితే, 'రాయన్' నిర్మాతలు... ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ సంస్థ ఇతరులకు ఇవ్వలేదు. వాళ్ళకు సొంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సన్ నెక్స్ట్ (Sun Nxt OTT) ఉంది. థియేటర్లలో తమ ఓటీటీ పార్ట్నర్ సన్ నెక్స్ట్ అని వేశారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు మంచి పేరు వచ్చింది. ధనుష్ డైరెక్షన్, టేకింగ్, మేకింగ్ వంటివి హైలైట్ అయ్యాయి. దాంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది.
Also Read: వాటీజ్ థిస్ విజయ్ ఆంటోనీ తమిళ 'తుఫాన్'... థియేటర్లలో విడుదలైన వారానికి ఓటీటీలో!
Raayan Movie Cast And Crew: కథానాయకుడిగా, నటుడిగా ధనుష్ ప్రయాణంలో 'రాయన్' చాలా ప్రత్యేకమైన సినిమా. రచన, దర్శకత్వ బాధ్యతలు చూసుకోవడం, అతని 50వ సినిమా కావడం కనుక! ఇందులో ధనుష్ తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ నటించారు. వాళ్ళ చెల్లెలి పాత్రను దుషారా విజయన్ చేశారు. ధనుష్, దుషారా మధ్య సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆస్పత్రిలో యాక్షన్ సీక్వెన్సును అందరూ మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆయన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాను... అందులో హీరోయిజాన్ని ఆయన పీక్స్‌లోకి తీసుకు వెళ్లందని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 'రాయన్' ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
Also Read: డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - రామ్, పూరి కాంబో గట్టిగా కొట్టిందిగా!