Vijay Antony's Toofan OTT: విజయ్ ఆంటోనీ తమిళ 'తుఫాన్'... థియేటర్లలో విడుదలైన వారానికి ఓటీటీలో!
Mazhai Pidikkatha Manithan OTT Release: విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'తుఫాన్'. తెలుగునాట థియేటర్లలో విడుదలై వారం అయ్యింది. అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Mazhai Pidikkatha Manithan streaming on Prime Video OTT: 'మళై పిడిక్కత మణితన్'... ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టడం కష్టం. కానీ, 'తుఫాన్' అంటే ఒక్క క్షణంలో గుర్తు పడతారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన హిందీ సినిమా 'జంజీర్' తెలుగు టైటిల్ అదే. రీసెంట్‌గా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించిన 'మళై పిడిక్కత మణితన్' కూడా తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలైంది.
థియేటర్లలో విడుదలైన వారానికి ఓటీటీలో!
Vijay Antony's Toofan Tamil Version Released On OTT: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల (ఆగస్టు) 9న 'తుఫాన్' విడుదల అయ్యింది. దానికి వారం ముందు తమిళ్ వెర్షన్ 'మళై పిడిక్కత మణితన్' థియేటర్లలోకి వచ్చింది. ఆగస్టు 2న తమిళనాట విడుదల అయ్యింది. కట్ చేస్తే... ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
Vijay Antony’s #MazhaiPidikkathaManithan is streaming now on AMAZON PRIME IN. pic.twitter.com/C1Zy1UvqKt
— Christopher Kanagaraj (@Chrissuccess) August 16, 2024
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'మళై పిడిక్కత మణితన్' స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకు ఆ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి, తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందో? వెయిట్ అండ్ సి.
Mazhai Pidikkatha Manithan Cast And Crew: 'తుఫాన్' సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ఇంతకు ముందు 'రాఘవన్', 'హత్య' సినిమాలను సైతం వారే నిర్మించారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'తుఫాన్'ను తెరకెక్కించారు. ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు.
'బిచ్చగాడు'తో తెలుగులోనూ విజయ్ ఆంటోనీ స్టార్ అయ్యారు. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆ స్థాయి విజయాన్ని ఇవ్వలేదు. మళ్లీ 'బిచ్చగాడు 2' విజయ్ ఆంటోనీకి తెలుగు, తమిళ భాషల్లో విజయం అందించింది.
విజయ్ ఆంటోనీతో పాటు శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు 'తుఫాన్'లో నటించారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: షిమోనా స్టాలిన్, డిజైనర్: తండోరా చంద్రు, యాక్షన్ కొరియోగ్రాఫర్: సుప్రీమ్ సుందర్, కళా దర్శకుడు: అరుముగస్వామి, కూర్పు: ప్రవీణ్ కేఎల్, సంగీత దర్శకులు: అచ్చు రాజమణి - విజయ్ ఆంటోనీ, తెలుగులో మాటలు: భాష్య శ్రీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

